కొరోన సమయలో విటమిన్-సి ఎంతో ఆరోగ్యం అని, రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని మన అందరికి తెలిసింది. అలాగే చర్మ సమస్యలు అరికట్టడానికి ఎంతో సహాయపడుతుంది కూడా. ఇది మీ చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ సి పిగ్మెంటేషన్తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ఎరుపును తగ్గిస్తుంది మరియు స్కిన్ టోన్ పొందడానికి కూడా సహాయపడుతుంది. ఇది మొటిమల అభివృద్ధిని కూడా నివారిస్తుంది మరియు మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
విటమిన్ సి టోనర్ మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం.
ఈ టోనర్‌ను సిద్ధం చేయడానికి, మీరు సులభంగా లభించే విటమిన్ సి టాబ్లెట్లను కొనుగోలు చేయాలి. కప్పు నీటిలో గ్రీన్ టీని తయారు చేసి, సరిగ్గా చల్లారేలా చుడండి. ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్ ను చూర్ణం చేసి గ్రీన్ టీలో కలపండి. బాగా కలపండి. అది వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ప్రే బాటిల్‌లో నిలవచేసుకోండి. చల్లదనం కోసం రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. దీనిని మీరు 7 రోజులు వరకు నిల్వ చేసుకోవచ్చు.
మీరు పడుకునే ముందు లేదా మీ దినచర్య ప్రకారం ఈ టోనర్‌ను ఉపయోగించవచ్చు. శుభ్రమైన ముఖం మీద పిచికారీ చేసి, సరిగ్గా 30 నిముషాలు ఉంచండి. దీనిని మీరు కాటన్ తో కూడా రాసుకోవచ్చు. ఇది తరచూ గా వాడటం తో మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. మీకు ఏదైనా అసౌకర్యం లేదా చికాకు ఎదురైతే వెంటనే దీని వాడకాన్ని ఆపేయండి.
Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon
ఇవి మీకు అవగాహన కొరకు మాత్రమే ఇవ్వడం జరిగినది.