AP కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీ విడుదల (APSLPRB Constable Preliminary Key)

ఏపీలో కానిస్టేబుల్ (AP కానిస్టేబుల్) పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ (ప్రిలిమినరీ కీ) విడుదలైంది.

దీనితో పాటు.. నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచింది APSLPRB. ఆన్సర్ కీపై జనవరి 25న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈమెయిల్ (Email) ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. మరే ఇతర విధానంలోనూ పంపే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌ని యామక బోర్డు చైర్మన్ మనీష్ కుమార్ తెలిపారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలు, అభ్యర్థులు OMR పత్రాలను రెండువారాల్లో ఉంచుతామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. అంతే కాకుండా.. ఏపీలో కానిస్టేబుల్‌కు 91 శాతం హాజరు అయినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌ మనీష్ కుమార్ సిన్హా ప్రకటించారు . ప్రిలిమినరీ కీ విడుదల చేసిన బోర్డు అధికారులు అత్యంత త్వరలో ఫిజికల్ టెస్ట్ జరిగిందని చెప్పారు.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

వీటికి సంబంధించిన తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మొత్తం ఈ పోస్టులకు ఐదు లక్షలు మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వ్యాప్తంగా పరీక్షకు 91 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,58,219 మంది పరీక్ష రాసినట్లు చెప్పారు. 45,268 మంది గైర్హజరయినట్లు ప్రెస్ నోట్ ద్వారా బోర్డు తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ రోజు జరిగింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 75 మంది పోటీపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 997 ఎగ్జామ్ సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాడు చేశారు.

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి