Hair fall అరికట్టే సామాన్య చిట్కాలు
మీరు ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతో జుట్టు రాలడాన్ని Hair fall అరికట్టవచ్చు. ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడానికి అనేక కారణాలు ప్రభావితం చేస్తాయి. ఆహారం, జీవనశైలి, జుట్టు సంరక్షణ, పని ఒత్తిడి, ఆరోగ్య సమస్య (థైరాయిడ్) మరియు అనేక పనులు జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి. ఆయుర్వేదం జుట్టు రాలడానికి సహజ పరిష్కారాలను అందిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. కానీ చాలామందికి అవి తగిన ఫలితాలు ఇవ్వడం లేదని అభిప్రాయాలూ ఉన్నాయి.
ఉసిరి, షికాకై మరియు కుంకుడు కాయలు :
ఉసిరి, షికాకై మరియు కుంకుడు కాయలు ఈ మూడు పదార్థాలు కలిపితే జుట్టు రాలడానికి మీ వన్ స్టాప్ పరిష్కారం అవుతుంది. ఇవి జుట్టు రాలడానికి అరికట్టే ప్రధాన మూలికలు గా పరిగణించాలి. ఆమ్లాలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి వాటితో జుట్టు దెబ్బతినడానికి నియంత్రించడంతో పాటుగా ఆరోగ్యకరమైన జుట్టు కణాలను పెరిగేలా చేస్తాయి. కుంకుడు కాయాలని వాడటం వలన వలన జుట్టు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగటానికి షికాకై సహాయపడుతుంది.
కలబంద రసం:
కలబందను చర్మ సమస్యలతో పాటుగా జుట్టు సమస్యలతో అరికట్టడానికి వాడవచ్చు. మీరు మీ జుట్టుకు కలబంద రసం లేదా జెల్ ను రాసుకొనవచ్చు. వీటి వలన జుట్టు పెరుగుతుంది. కలబంద జెల్ ను జుట్టు పై మసాజ్ చేయడంతో ఒత్తైన జుట్టును పెరగడం లో మీకు సహాయపడుతుంది.
భ్రింగరాజ్ నూనె:
భ్రింగరాజ్ నూనెజుట్టు పెరుగుదలను కోసం, జుట్టును బలోపేతం చేయడానికి మరియు చుండ్రును అరికట్టడానికి భ్రింగరాజ్ నూనె ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. మంచి జుట్టు ఆరోగ్యం కోసం మీరు భ్రింగరాజ్ నూనెను వాడుకోవచ్చు. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు ఉత్తమమైన విటమిన్.
మరిన్ని ఆరోగ్యానికి సంభందించిన విషయాల కోసం teluguguruji.com