డిప్రెషన్ అంటే ఏమిటి?
డిప్రెషన్ అంటే నిరాశ అనే చెప్పాలి. ఇది ఒక వ్యాధి లేక మానసిక సమస్య అని చాలా మంది ఒక సందిగ్దం లో ఉంటారు. కొంతమంది ఇది ఎదో సెలేబ్రటీలకు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కారణం వారి యొక్క ఆర్థిక స్తోమత కారణంగా దీనిని గుర్తించి సరైన వైద్య సహాయం పొందుతారు. జీవితంలో కొన్ని సమయాల్లో ఆందోళన చెందడం, విచారకరమైన మరియు కలతపెట్టే సంఘటనలు అందరికీ జరుగుతాయి. దీని వలన నిరాశకు గురవడం జరుగుతుంది. ఇదే నిరాశతో ఉంటే మీరు డిప్రెషన్ లో జారుకునే అవకాశం ఎక్కువ అనే చెప్పాలి.
డిప్రెషన్ ద్వారా రోజువారీ పనికి ఆటంకం కలుగుతుంది, ఫలితంగా సమయం కోల్పోవడం మరియు చేసే పనులలో ఉత్పాదకత తగ్గడం. కుటుంబ కలహాలు మరియు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే డిప్రెషన్ ఒక మానసిక మరియు శారీరక సమస్య గా చూడాలి
డిప్రెషన్ కారణంగా వచ్చే వ్యాధులు:
- ఆర్థరైటిస్
- ఉబ్బసం
- హృదయ వ్యాధి
- క్యాన్సర్
- డయాబెటిస్
- ఊబకాయం
సాధరణంగా డిప్రెషన్ కలిగిన వ్యక్తులలో కలిగే లక్షణాలు:
కోపం, దూకుడు, చిరాకు, ఆత్రుత, చంచలత వంటి మానసిక స్థితి, విచారంగా, నిస్సహాయంగా అనిపించడం, ఆసక్తి కోల్పోవడం, తొందరగా అలసిపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, అధికంగా తాగడం, మాదకద్రవ్యాలను వాడటం, లైంగిక కోరిక తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది, ఎదుటి వారు మాట్లాడే సమయంలో ఆలస్యంగా జవాబు చెప్పటం, ఆలస్యం, నిద్రలేమి, అధిక నిద్ర, అలసట, నొప్పులు, తలనొప్పి, జీర్ణ సమస్యలు కనపడుతుంటాయి.
డిప్రెషన్ నుండి బయటపడాలంటే :
- మీ ఆలోచనలు అదుపుచేయడానికి ప్రయత్నం చేయండి. దాని కోసం యోగ, ధ్యానం లాంటివి మీ జీవితం లో ఒక భాగం లా మార్చుకోండి.
- మీకు కలిగే భావాలను మీ ఆప్తులతో చర్చించండి.
- ఎవరితో అయిన మాట్లాడలనిపిస్తే వారితో నేరుగా కలిసి మాట్లాడండి. సాధ్యమైనంత వరకు టెలిఫోన్ సంభాషణ లేక చాటింగ్ చేయకండి.
- ఎప్పుడు ఒంటరిగా కూర్చోకండి. దీని వలన మీకు ఆలోచనలు పెరగవచ్చు.
- సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనండి. అలాగే మీకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి.
- రోజు మీ నిద్ర కనీసం 8 గంటలు ఉండేలా ప్రణాళిక చేసుకోండి. మీరు చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్రపోతున్నా, మీ మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉంది.
- ఆరు బయట వ్యాయామం చేయడం ద్వారా కలిగే సూర్యరశ్మిని ఆనందించండి. అలాగే హైకింగ్, స్థానిక పార్కులో నడవడం లేదా టెన్నిస్ లాంటి ఆటలు ఆడటం అలవాటు చేసుకోండి.
- శారీరక సమస్యలను మీ డాక్టర్ తో సంప్రదించి తగిన వైద్య సహాయం పొందండి.
గమనిక: ఇది అవగాహన కొరకు మాత్రమే ఇవ్వబడినది.