CISF Constable Jobs: రేపటి నుంచి CISF పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు

ఉన్నత చదువులు చదివిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు(ఉద్యోగాలు) తక్కువగా లభిస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగులు అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ టెన్త్ పాసైన నిరుద్యోగులకుసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) గుడ్ న్యూస్ చెప్పింది.

తాజాగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి (CISF రిక్రూట్‌మెంట్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cisfrectt.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభం. అంటే.. రేపాటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కాబోతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 22 చివరి తేదీగా గుర్తుంచుకోవాలి. ఈ లోపే దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలిలా..

మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. వీటిలో 183 ఖాళీలు కానిస్టేబుల్/డ్రైవర్ మరియు 268 ఖాళీలు కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

అర్హత ప్రమాణాలు

ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం

  • ముందుగా సీఐఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ cisfrectt.in ను సందర్శించాలి.

-హోమ్‌పేజీలో లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్-2022 లింక్‌పై క్లిక్ చేయాలి.

  • అనంతరం జరిగిన నంబర్, టెక్స్ట్ పాస్ ఇమేజ్‌ను ఎంటర్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేసి, తర్వాత పేమెంట్ చేయాలి.

UR, OBC, EWS కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికుల (ESM) కేటగిరికి చెందిన అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చివరగా అప్లికేషన్ సాప్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి మల్టి-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. , 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ వర్తించబడుతుంది “నేషనల్ పెన్షన్ సిస్టమ్‌గా చూపబడుతుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పెన్షనరీ ప్రయోజనాలు అందుతాయి.

1969లో సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటు

ప్రభుత్వరంగ సంస్థలకు సమగ్ర భద్రత కల్పించాలనే లక్ష్యంతో 1969లో కేవలం మూడు బెటాలియన్లతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటైంది. ఈ దళం అప్పటి నుంచి 1,63,590 మంది సిబ్బందితో ఒక ప్రధాన మల్టి-స్కిల్ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం CISF దేశం మొత్తం పొడవునా 353 స్థావరాలకు భద్రతను అందిస్తోంది. CISFకు సొంత ఫైర్ వింగ్ కూడా ఉంది.

అణు వ్యవస్థాపనలు, అంతరిక్ష సంస్థలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్లు వంటి వాటికి సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తుంది. ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, ఐకానిక్ హెరిటేజ్ స్మారక చిహ్నాలు, ఢిల్లీ మెట్రోకు సైతం రక్షణ కల్పిస్తోంది. అదనంగా CISF ఒక ప్రత్యేకమైన VIP సెక్యూరిటీ వర్టికల్‌ను కూడా కలిగి ఉంది. ఇది ముఖ్యమైన వ్యక్తులకు రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీని కూడా అందిస్తుంది.

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి