గర్భధారణ లో Diabetes ఎలా అదుపుచేయాలి
Gestational Diabetes (గర్భధారణ మధుమేహం) :
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ లలో అవసరమైన అదనపు ఇన్సులిన్‌ను స్రవింపజేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని గేస్తేశ్నల్ డయాబెటిస్ (గర్భధారణ మధుమేహం) అంటారు.

గర్భధారణ మధుమేహం ఉన్న చాలా మంది మహిళలకు రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలు:
పరగడుపున : 70- 90 ఎంజి / డిఎల్
భోజనం చేసిన 1 గంట తర్వాత: 120- 130 మి.గ్రా / డిఎల్
భోజనం చేసిన 2 గంటలు తర్వాత: 100- 120 ఎంజి / డిఎల్
గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను సాధారణ పరిమితుల్లో ఉంచడం వలన గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోవడం జరుగుతుంది.
సరియైన సమయంలో గర్భధారణ మధుమేహం చికిత్స అందించక పొతే గర్భంలోని శిశువుకు ఈ క్రింద సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- చాలా పెద్ద మరియు అదనపు కొవ్వుతో జన్మించడం.
- పుట్టిన వెంటనే రక్తంలో తక్కువ గ్లూకోజ్.
- శ్వాస సమస్యలు.
ఈ క్రింది విధముగా నియమాలను పాటించిన మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.
భోజనపు అలవాట్లు:
- మీకు మరియు బిడ్డకు ఆరోగ్యం కోసం మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోండి. మీరు తీసుకునే ఆహరం మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్ణీత పరిధిలో ఉండే విధముగా చూసుకోండి.
- ప్రతిరోజూ మూడు చిన్న భోజనాలు మరియు స్నాక్స్ తినండి.
- మీ భోజనంలో పండ్లు, కూరగాయలు మరియు పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు మరియు రొట్టె రూపంలో ఫైబర్ ను తీసుకోండి.
- స్వీట్లను పరిమితం చేయండి.
మీకు ఆహరం పైన అవగహన కొరకు మంచి డైటీషియన్ ఎంచుకొని వారి సలహాలను పాటించండి.
వ్యాయామం మరియు శారీరక శ్రమ:
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలలో నడక మరియు ఈత వంటివి ఎంతగానో సహాయపడతాయి.
మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ప్రతి రోజు నడక చేయండి. ఇలా చేయడం వలన మీ శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఇన్సులిన్ మందులు (అవసరమైతే):
గర్భధారణ మధుమేహం ఉన్న కొందరు మహిళలకు వారి రక్తంలో గ్లూకోజ్ అదుపులోనికి రాకపోవడం జరిగిన, వైద్యులు ఇన్సులిన్ ని సూచన చేస్తారు.
వారి సూచనల ప్రకారం మీరు ప్రతిరోజూ 1 నుండి 4 ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవలసి ఉంటుంది.
మరిన్ని ఆరోగ్యానికి సంభందించిన విషయాల కోసం teluguguruji.com