How to Wakeup & Sleep Early
నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు , ఉదయాన్నే నిద్ర లేవడం ఎలా How to Wakeup & Sleep Early చెప్పండి అని, ఎందుకంటే వాళ్లు యూట్యూబ్‌లో చూసినవి మరియు ఇతర ఇతర పేపర్లలో చదివి ఆచరించి ఫలితాలు అందక , ఇంకొంతమంది ఫోన్లో యాప్ వేసుకోండి అదే మిమ్మల్ని నిద్ర లేపుతుంది అని అంటారు మరి కొంతమంది అలారం దగ్గరగా లేక దూరంగా పెట్టుకోండి అంటారు నిజంగా ఇవన్నీ చేస్తే మన ఉదయాన్నే లేవడం కుదురుతుందా ? ఏ మాత్రం కుదరదు అని అనుకోవాలి.
ఎందుకంటే ఉదయం నిద్ర ఎలా ఉంటుందో తెలుసా! మనం 05:00 గంటలకి అలారం పెట్టు కుంటే అది మ్రోగ గానే మన మనసులో అనుకుంటాం ఈరోజు పెద్ద పని ఏంలేదులే అని 05:15 నిమిషాలకు దాని తర్వాత 06:00 గంటలకి ఆ తర్వాత మళ్లీ 6:30 నిమిషాలకు లేవచ్చు కదా అని….. అలా అనుకుంటూనే సరిగ్గా నిద్ర మెలుకువ వచ్చే సరికి 07:30 అవుతుంది. ఇక అప్పటి నుండి మన పరుగు మొదలవుతుంది.
ఎంతమంది ఇలా మీ జీవితాలలో సరిగ్గా ఇలానే చేస్తున్నారు.
ఉదయాన్నే నిద్ర లేవడం అంటే అలారం పెట్టుకుని అంత తేలికైన పని కాదు ఆహారపు అలవాట్లు, శారీరక అలవాట్లు మనం చేసే పనులు వీటన్నిటి ప్రభావం నిద్ర మీద ఎంతో ఉంటుంది.
ఒక్కసారి మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా అడగండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీరు చదువుకోడానికి బాగానే ఉంటుంది కానీ ఆచరించేటప్పుడు మాత్రమే ఒక పెద్ద సమస్యలా కనబడుతుంది.
సరిగ్గా ఎప్పుడు నిద్ర లేవాలి అనుకుంటున్నారు ఒక పుస్తకంలో రాసుకోండి 05:00 గంటలకు అని మీ మనసులో అనుకున్నాను కాబట్టి అలారం ఎప్పుడు 5:00 పెట్టుకోకండి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది అలవాటుగా మారాలి అంటే సరిగ్గా ఆ పనిని 28 రోజులు చేయాలి అప్పుడే అది అలవాటుగా మారుతుంది.ఇప్పుడు మీరు ఐదు గంటలకు లేవాలి అని అనుకుంటున్నారు కాబట్టి రేపు ఉదయం సరిగ్గా మీరు సరాసరి ఆరు గంటలకి అలారం పెట్టు కోండి అయితే రోజూ ఒక ఐదు లేదా పదినిమిషాలు మీకు అనుకూలంగా అలారం ముందుకు జరుపుతూ 28 రోజుల తర్వాత 05:00 గంటలకు లేచే విధముగా ఏర్పాటు చేసుకోండి.
రాత్రి తొందరగా పడుకోండి, తొందరగా అంటే 07:00 గంటలకు కాదు. సుమారుగా రోజు రాత్రి 11:00 గంటలకి పడుకునేవారు అయితే , అలా కాకుండా 10:30 నిమిషాలకి పడుకోవడానికి ప్రయత్నించండి.
కొంతమందికి 10:00 గంటలకి పడుకోగానే నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు ఒక చిన్న పుస్తకం లేదా ఏదైనా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకం చదివే ప్రయత్నం చేయండి.
పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకం మొత్తం చదవడం కాదు. 28 రోజులు మీరు పెట్టుకున్న ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సరిపడా రెండు పేజీలు లేదా మూడు పేజీలు మీకు వీలైనంత చదివేలా పెట్టుకోండి.
- మరుసటి రోజు చేయవలిసిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి.
- నిద్రపోయే ఒక 30 నిమిషాల ముందు వరకు మీరు ఫోన్ కానీ, టీవీ కానీ చూడటం ఆపేయండి. ఎలక్ట్రానిక్ స్క్రీన్‌తో వచ్చే కాంతి కిరణాలు మీ కంటి లోని నిద్రను అవుతుంటాయి.
- నిద్రపోయే ముందు కాఫీ కానీ, టీ తాగడం కానీ ఆపేయండి. సాధ్యమైనంతవరకు రాత్రిపూట తినే ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మాంసాహారం మాత్రం తినకుండా ఉండేలా ప్రయత్నించండి.
ప్రతిరోజు నడవడం అలవాటు చేసుకోండి మీరు ఎంత నడుస్తారో సాయంత్రం మీకు అంత మంచి నిద్ర పడుతుంది.
- రోజు నిద్రపోయే ముందు మీరు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి మీకు అంతా మంచే జరిగింది, జరగబోతుందని అనుకోని పడుకోండి. ఇలా చేయడం తో మీ మనసు ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది.
How to Wakeup & Sleep Early ఉదయాన్నే నిద్ర లేవడం ఎలా అనే మీ ప్రశ్న కు సమాధానం దొరికిందా.
మరిన్ని ఆసక్తి కరమైన విషయాలకు teluguguruji.com