ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana
భారత దేశ ప్రభుత్వం చిన్న మరియు సన్న కారు రైతుల కోసం వారికీ సహయంగా సంవత్సరానికి రూ .6,000 లను ఆర్థిక ప్రోత్సహకం గా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. దీనినే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana అని పిలుస్తారు.
అయితే ఈ పధకం ద్వారా రైతుల కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో రూ. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున మొత్తం రూ. 6000 ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (పిఎం-కిసాన్ యోజన) 1వ తేదిన డిసెంబర్ 2018 ప్రారంభించడం జరిగింది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఖాతాలలో నేరుగా సంవత్సరానికి రూ .6,000 లను ఆర్థిక ప్రోత్సహకం బదిలీ చేయడం జరుగుతుంది.
మార్గదర్శకాలు ప్రకారం ఈ పధకం ఈ క్రింది వారికీ వర్తించదు.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు, అలాగే రిటైర్డ్ ఆఫీసర్లు మరియు ఉద్యోగులు. (క్లాస్ IV / గ్రూప్ డి ఉద్యోగులను మినహాయింపు కలదు)
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ మరియు స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు. (క్లాస్ IV / గ్రూప్ డి ఉద్యోగులను మినహాయింపు కలదు).
- రాజ్యంగ పదవులలో ఉన్నవారికి అనగా ప్రస్తుత మంత్రులు / రాష్ట్ర మంత్రులు మరియు లోక్ సభ / రాజ్యసభ / రాష్ట్ర శాసనసభ / ప్రస్తుత సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ల మరియు మేయర్లు, జిల్లా పంచాయతీల అధ్యక్షులు.
- పైన తెలిపిన వాటిలో పదవులు అలకరించిన మాజీ సభ్యులకు కూడా ఈ పథకం వర్తించదు.
- గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులకు ఈ పథకం వర్తించదు.
- అలాగే వృత్తి విద్య నిపుణులు న్యాయవాదులు, వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఇంజనీర్లు, మరియు ఆర్కిటెక్ట్స్ వంటి వారు.
ఈ పథకం లో రైతులు తమ పేర్లను గ్రామా పంచాయితీ కార్యాలయం నందు కాని లేక మండల పరిషత్ కార్యాలయం లో కాని సంప్రదించి వారికీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ల ఐడి కార్డ్, ఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులను మరియు ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా సంఖ్య మరియు లబ్ధిదారుల మొబైల్ నంబర్ ను అందచేయాల్సి ఉంటుంది. ఈ పథకం PM Kisan Samman Nidhi Yojana గురించి మరింత సమాచారంకోసం https://pmkisan.gov.in/
దీని పైన ఎటువంటి సమాచారం కావాల్సిన ఫోనే చేయాల్సిన నంబర్లు టోల్ ఫ్రీ నంబర్: 18001155266 ల్యాండ్‌లైన్ నంబర్లు: 011—23381092, 23382401.
మరిన్ని ఆసక్తి కరమైన విషయాల కోసం teluguguruji.com