జ్వరం ఎందుకు వస్తుంది? Reasons for Fever?

జ్వరం అంటే ఏమిటి జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ ఉష్ణోగ్రత ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతూ ఉంటుంది, అయితే ఇది సాధారణంగా 98.6°F (37°C) ఉంటుంది. జ్వరం ఒక వ్యాధి కాదు. ఇది సాధారణంగా మీ శరీరం అనారోగ్యం లేదా శరీరం లో ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం రావచ్చు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ శరీరం లోని రోగ నిరోధక శక్తి వైరస్ లతో  పోరాడటానికి ప్రయత్నిస్తుందని చెప్పే ఒక లక్షణం.

ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల, కలుషితం అయిన ఆహారం, నీరు, వాతావరణం లో మార్పుల వలన కలగవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానితో పోరాడడానికి రక్తం లోని తెల్ల రక్తకణాలు సిద్దంగా ఉంటాయి. ఆ పోరాటం లోనే జ్వరం వస్తుంది. ఇలాంటి సందర్భాలలో శరీరం కాస్త వేడిగా ఉంటుంది. ఇది మరింత పెరిగితే వేడి మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే మంచి మందు పారాసెటామోల్, ఇది రకరకాల పేర్ల తో మార్కెట్ లో దొరుకుంతుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఆంటిబయోటిక్ ను డాక్టర్ లు సూచిస్తుంటారు. సాధారణ జ్వరం తగ్గుతుంది.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

ఏంటి బయోటిక్స్ 5 నుండి 7 రోజులు వాడాల్సి ఉంటుంది. జ్వరం తగ్గింది అని  పూర్తి కోర్స్ వాడక పోవడం జరిగితే  ఇన్ఫెక్షన్ మరల తిరగ బెడుతుంది. డాక్టర్ చెప్పిన మందులు పూర్తిగా  కోర్సు వాడాలి.

జ్వరం మాత్రమే కదా అని కొన్ని సందర్భాలలో చాలా మంది సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. డాక్టర్ సూచన మేరకు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ను సంప్రదిస్తే జ్వరం ఎందుకు వస్తుందో రోగి లక్షణాలను గమనించి సరి అయినా వైద్యం చేస్తారు.

చాలా మంది జ్వరం గా ఉన్నప్పుడు ఆహారం తీసుకోకుండా అశ్రద్ధ చేస్తుంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. బలమైన ఆహారం తీసుకోవాలి. రెండు నుండి మూడు రోజులలో  జ్వరం తగ్గక పొతే ఆ విషయం తేలికగా తీసుకోకూడదు.

జ్వరం రావడానికి ప్రధాన కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. శరీరానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, అది పైరోజెన్ అనే రసాయనాలను రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఈ పైరోజెన్‌లు హైపోథాలమస్‌కి ప్రయాణిస్తాయి మరియు శరీరం యొక్క థర్మోస్టాట్‌ను అధిక ఉష్ణోగ్రతకు రీసెట్ చేస్తాయి. ఈ అధిక ఉష్ణోగ్రత ఆక్రమణ సూక్ష్మజీవుల పెరుగుదల మరియు పునరుత్పత్తికి తక్కువ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఇన్ఫెక్షన్‌లతో పాటు, జ్వరం రావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి, అవి:

  • రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా లూపస్ వంటి తాపజనక పరిస్థితులు
  • మనం వాడే కొన్ని రకాల మందులు కావచ్చు
  • ఆటోఇమ్యూన్ డిజార్డర్స్
  • కొన్ని రకాల కాన్సర్
  • వడ దెబ్బ

జ్వరం అనేది అనారోగ్యం కాదని, ఇది అంతర్లీన పరిస్థితి వల్ల వచ్చే లక్షణం అని గమనించడం ముఖ్యం. అందువల్ల, జ్వరానికి చికిత్స చేయడం మాత్రమే సరిపోదు. జ్వరానికి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయాలి.

చాలా సందర్భాలలో, జ్వరాన్ని ఎసిటమైనోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ మందులతో చికిత్స చేయవచ్చు. పుష్కలంగా ద్రవాలు త్రాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు జ్వరం ఉన్న వ్యక్తిని సౌకర్యవంతంగా ఉంచడం కూడా జ్వరాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. జ్వరం చాలా ఎక్కువగా ఉంటే, ఎక్కువ కాలం పాటు కొనసాగితే లేదా తీవ్రమైన తలనొప్పి, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటే, వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి