మీరు ఈ వ్యాసం పేరు చదివి ఆశ్చర్యపోకండి… ఎవరైనా ఎక్కువ లాభాల కోసం ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ మనకి కావాల్సింది లాభాలు కాదు, ముందు నష్టాలు రాకుండా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరూ, అంటే మన పెట్టుబడి స్థిరం గా ఉంటె లాభం ఈ రోజు కాకుండా రేపు అయినా వస్తుంది.
నష్టాలను తగ్గించుకుంటూ లాభాలు రావాలంటే చేయకూడని పనులు ఈ క్రింద తెలుపబడినవి.
సరైన పరిశోధన లేకుండా ఎటువంటి షేర్లు కొనరాదు లేదా అమ్మరాదు.
కొందరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చాం కదా అని ఎదో ఒక షేర్ కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటారు. పూర్తీ నష్టం వచ్చిన తర్వాత వాటి నుండి బయట పడి నష్టాలు వచ్చాయని చెప్పుకుంటారు.
Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon
మొత్తం పెట్టుబడి స్టాక్ మార్కెట్ లో పెట్టరాదు.
అలాగే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం స్టాక్ మార్కెట్ లో పెడితే నష్టం వస్తే పరిస్థితి ఏంటి అని అలోచించి అడుగులు వేయాలి. లాభాల ఆశలో నష్టాలు వస్తాయని మరిచి పోకూడదు.
ఉచిత సలహాను నమ్మి ఏది కొనవద్దు లేదా అమ్మవద్దు.
ఇంకొంత మంది యు ట్యూబ్ లేదా సామాజిక మాధ్యమాల లో చూసి లేదా స్నేహితులకి లాభాలు వచ్చాయని, స్నేహితులు చెప్పిన వెంటనే వీరు కూడా అవే కంపెని షేర్లను కొని నష్టాలను చూస్తుంటారు.
మార్కెట్ తో పోటి పడటం చేయకూడదు.
మరికొంతమంది మార్కెట్ తో పోటి పడి మరి షేర్లను కొంటు, అమ్ముతూ ఉంటారు. పెరిగిన వెంటనే కొని తిరిగి పెరుగుతుందని ఆశపడుతుంటారు. ఇలా ఎప్పడు జరుగదు అంటే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా పెరగటం కాని, స్థిరంగా తగ్గడం కాని జరగదు. మార్కెట్ ను ఊహించడం చేయకండి.
ఊపిక, సహనం లేకపోవడం.
కొంతమంది కొన్న షేర్ పెరగకపోవటం కాని, తగ్గక పోవటం కానీ జరగటంతో వాటిని వెంటనే అమ్మేస్తారు. అవి అమ్మిన తర్వాత పెరిగితే చాలా మంది బాధ పడుతుంటారు.
పెట్టుబడిని జూదంగా తీసుకోకండి.
స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యాపారం లాంటిది, లాభాలు మెల్లగాను నష్టాలు తొందరగా వస్తుంటాయి అని అనుకుంటూ ఉండాలి. లాభాలు త్వరగా సంపాదించడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు. అలా అయితే అందరూ స్టాక్ మార్కెట్ నే ఎంచుకుంటారు కదా.
గుంపు నిర్ణయాలను అనుసరించవద్దు
చాలా మంది ఈ స్టాక్ అందరూ కొంటున్నారు కదా అని కొని నష్టపోతుంటారు. ఇది చాలా ప్రమాదం, సరైన అవగాహానా లేకుండా పెట్టుబడి పెట్టకండి.
అనవసరమైన నష్టాలను తీసుకోకండి.
ఏదైనా పెట్టుబడి పెట్టేముందు దాని నష్టాన్ని అంచనా వేసి ఒక వేళ మీ అంచనాని మించి నష్టం వస్తే వెంటనే దాని నుండి బయటపడండి. అది పెరుగుతందిలే అనే అపోహలను పెంచుకోవద్దు. దాని వలన ఎక్కువ నష్టాలను చూడాల్సి వస్తుంది.
భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి.
పోయిన నష్టాన్ని ఒకే రోజు లాభాలుగా మార్చాలనే నిర్ణయాలను తీసుకోకండి. అది ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి నిర్ణయాల వలన మీ పెట్టుబడి మొత్తం ప్రమాదాల్లో పడే అవకాశం ఎక్కువ.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు త్వరగా ధనవంతులు అవుతారు అనే ఆలోచన ఉంటె వెంటనే దానిని తీసి వేయండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా హాని కలిగిస్తుంది.
మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం నేర్చుకోండి అంటే మీ పెట్టుబడి ఏదైనా ఒకే కంపెని లో కాకుండా వేరు వేరు రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడి పెట్టండి. ఇది మీ పెట్టుబడి ని స్థిరమైన సమతుల్యం చేయడంలో మీకు సహాయపడుతుంది.