స్టాక్ మార్కెట్‌లో లాభాలను ఆర్జించే రహస్యాలు (Secretes to Earn Profits in Stock Market)

డబ్బులు సంపాదించడం చాలా తేలిక అని తెలుగు సినిమా లో హీరోలు చెప్పే మాటలు విని స్టాక్ మార్కెట్ లో అతి తక్కువ పెట్టబడి తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికీ ఈ రహస్యాలు Secretes to earn profits in Stock market ఎంతో లాభం చేకూర్చుతాయి.

నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఒక ప్రత్యేక నేర్పు. ఎంతో కాలం గమనిస్తూ నేర్చుకుంటూ ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం లేకుంటే ఎంతో నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఇది ఒక మాస్ హిస్టిరియా కలిగించే ఒక పెద్ద మాధ్యమం అనే అనవచ్చు ఎందుకంటే ఎప్పుడు చాలా మంది యుట్యూబ్ లో ప్రతి ఒక్కరు లాభాలు వస్తున్నాయని  చెప్తుంటారు.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

నిజానికి వారు చెప్పే మాటలు ద్వారా  లాభాలు వస్తే  వారికీ యుట్యూబ్ లో వీడియోలు చేయాల్సిన అవసరం ఏముంది ? అలాగే కొంతమంది మా ద్వారా ట్రేడింగ్ ఎకౌంటు తీసుకోండి వారికి  రోజు ఉచితంగా స్టాక్ సలహాలు ఇస్తామని  అంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి.

నిజానికి రహస్యాలు కాని ఒక ప్రత్యేకమైన పద్దతి అనేవి ఉండవు. కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. కానీ పక్రమశిక్షణ తో కూడిన పెట్టుబడులతో దీర్ఘ కాలం లో లాభాలను ఆశించవచ్చు.

ఆలోచించే వారికీ కోసం మాత్రమే ఈ విషయాలు.

1. తక్కువ సమయం లో, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సంపాదించాలని అసలు అనుకోవద్దు. స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15–20% వరకు లాభాలు రావచ్చు. మీరు నిజంగా అదృష్టవంతులు అయితే అవి 25 % కూడా ఉండవచ్చు.

2. మీరు స్టాక్ మార్కెట్ లో కొత్తగా ప్రవేశం చేస్తే  ముందుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి.

3. మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి లో 50% నష్టం వచ్చిన మీరు నిశితంగా గమనించగలరు అనుకుంటేనే అందులోకి దిగండి.

4. ఎక్కువ లాభాలు వచ్చే టిప్స్ ఇస్తామనే వారిని నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

5. సెబీ ద్వారా రిజిస్టర్ అయిన స్టాక్ అడ్వైసర్ ద్వారానే పెట్టుబడులు పెట్టండి. అసలు సమస్య అందరు సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే కానీ మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ ఎవరు అనేది తెలియడం కష్టం.

6. స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లాభాలు రాకపోవచ్చు. ఒకసారి నష్టం వస్తే మరో సారి లాభం రావచ్చు. కాని దీర్ఘకాలం లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

7. పెట్టుబడి కనీసం మీరు 8 నుండి 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టె లా ప్రణాళిక సిద్దం చేసుకోండి.

8. మీరు పెట్టుబడులు అనేక రంగాల్లో అంటే బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, సిమెంట్ లాంటి వాటిలో  పెట్టుబడి పెట్టడం మంచిది. దీనిని డైవర్సిఫికేషన్ అంటారు. దీని వలన మీరు నష్టపోయే అవకాశం చాలా తక్కువ.

9. అయితే మీరు ఎక్కువ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. 10 నుండి 15 కంపెనీల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టండి.

10. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించిన వార్తలు, కంపెనీ స్టేట్మెంట్స్, లాభనష్టాలు అన్నీ సమయానికి మీరు వాటిని గమనిస్తూ ఉండాలి.

11. మీరు ప్రతి స్టాక్ యొక్క సమాచారం కావాలని అనుకుంటే మీరు moneycontrol.com గమనించండి.

12. అదీ మీరు ఎక్కువ కంపెనీలలో పెట్టుబడులు పెడితే గమనించే అవకాశం చాలా తక్కువ.

13. ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ఎంతో మంచిది. వీటిలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ చిన్న కంపెనీలతో పోల్చుకుంటే. అయితే పెద్ద కంపెనీలలో పెట్టుబడి సురక్షితం ఏమాత్రం కాదు గమనించండి.

14. మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్స్ లో నష్టాలు వస్తే వెంటనే మీరు వాటిని అమ్మేయండి, కానీ వాటి ద్వారా లాభాలు వస్తాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు.

15. మీరు పూర్తిగా శ్రద్ద తో స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే NSE India వెబ్ సైట్ ను చూడండి. వారు తెలిపిన కోర్సులు మీకు ఎంతో ఉపయోగకరంగా  ఉంటాయి.

పైన తెలిపిన విషయాలను మీరు పాటిస్తే లాభాలను ఆశించక పోయిన నష్టాలూ మాత్రం మీరు చూడరని చెప్పవచ్చు. ఏదైనా ఖచ్చితమైన రహస్యాలు Secretes to earn profits in Stock market అనేవి ఉండవని మీరు గమనించండి.

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి