గర్భధారణ లో Diabetes ఎలా అదుపుచేయాలి
Gestational Diabetes (గర్భధారణ మధుమేహం) :
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ లలో అవసరమైన అదనపు ఇన్సులిన్‌ను స్రవింపజేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని గేస్తేశ్నల్ డయాబెటిస్ (గర్భధారణ మధుమేహం) అంటారు.
గర్భధారణ మధుమేహం ఉన్న చాలా మంది మహిళలకు రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలు:
పరగడుపున : 70- 90 ఎంజి / డిఎల్
Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon
భోజనం చేసిన 1 గంట తర్వాత: 120- 130 మి.గ్రా / డిఎల్
భోజనం చేసిన 2 గంటలు తర్వాత: 100- 120 ఎంజి / డిఎల్
గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను సాధారణ పరిమితుల్లో ఉంచడం వలన గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోవడం జరుగుతుంది.
సరియైన సమయంలో గర్భధారణ మధుమేహం చికిత్స అందించక పొతే గర్భంలోని శిశువుకు ఈ క్రింద సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- చాలా పెద్ద మరియు అదనపు కొవ్వుతో జన్మించడం.
- పుట్టిన వెంటనే రక్తంలో తక్కువ గ్లూకోజ్.
- శ్వాస సమస్యలు.
ఈ క్రింది విధముగా నియమాలను పాటించిన మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.
భోజనపు అలవాట్లు:
A. మీకు మరియు బిడ్డకు ఆరోగ్యం కోసం మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోండి. మీరు తీసుకునే ఆహరం మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్ణీత పరిధిలో ఉండే విధముగా చూసుకోండి.
B. ప్రతిరోజూ మూడు చిన్న భోజనాలు మరియు స్నాక్స్ తినండి.
C. మీ భోజనంలో పండ్లు, కూరగాయలు మరియు పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు మరియు రొట్టె రూపంలో ఫైబర్ ను తీసుకోండి.
D. స్వీట్లను పరిమితం చేయండి.
మీకు ఆహరం పైన అవగహన కొరకు మంచి డైటీషియన్ ఎంచుకొని వారి సలహాలను పాటించండి.
వ్యాయామం మరియు శారీరక శ్రమ:
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలలో నడక మరియు ఈత వంటివి ఎంతగానో సహాయపడతాయి.
మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ప్రతి రోజు నడక చేయండి. ఇలా చేయడం వలన మీ శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఇన్సులిన్ మందులు (అవసరమైతే):
గర్భధారణ మధుమేహం ఉన్న కొందరు మహిళలకు వారి రక్తంలో గ్లూకోజ్ అదుపులోనికి రాకపోవడం జరిగిన, వైద్యులు ఇన్సులిన్ ని సూచన చేస్తారు.
వారి సూచనల ప్రకారం మీరు ప్రతిరోజూ 1 నుండి 4 ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవలసి ఉంటుంది.
గమనిక : ఇది గర్భధారణ మధుమేహం పై అవగాహన పెంచడం కోసం ఇవ్వబడినది. పూర్తీ చికిత్స వివరాలకు మీ వైద్యున్ని సంప్రదించండి.