వినాయక చవితి కథ | Vinayaka Chavithi Story in Telugu

భారతీయుల ప్రముఖ పండగలలో వినాయక చవితి ఒక ముఖ్యమైన పండగా గణించబడుతుంది. పార్వతీ మరియు పరమేశ్వరుడి కుమారుడు వినాయకుడి పుట్టిన రోజున ఈ పండగను చవితి అంటారు. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నక్షత్రం రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది.

పూజా విశేషాలు

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.

  1. మాచీ పత్రం/మాచిపత్రి 
  2. బృహతీ పత్రం/ములక
  3. బిల్వ పత్రం/మారేడు
  4. దూర్వా పత్రం/గరిక
  5. దత్తూర పత్రం/ఉమ్మెత్త
  6. బదరీ పత్రం/రేగు
  7. అపామార్గ పత్రం/ఉత్తరేణి
  8. తులసీ పత్రం/తులసి
  9. చూత పత్రం/మామిడి
  10. కరవీర పత్రం/గన్నేరు
  11. విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం
  12. దాడిమీ పత్రం/దానిమ్మ
  13. దేవదారు పత్రం/దేవదారు
  14. మరువక పత్రం/ధవనం, మరువం
  15. సింధువార పత్రం/వావిలి
  16. జాజి పత్రం/జాజిమల్లి
  17. గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు)
  18. శమీ పత్రం/జమ్మి
  19. అశ్వత్థ పత్రం/ రావి
  20. అర్జున పత్రం/ తెల్ల మద్ది
  21. అర్క పత్రం/జిల్లేడు.

వినాయకుడు విఘ్నేశ్వరుడు గణనాయకుడు గణపతి గణేశుడు లంబోదరుడు ఇలా మహా గణపయ్య పిలుచుకుంటారు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు భక్తులు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పని చేసిన అడ్డంకులు తొలగించు వాడు, ఏ పని మొదలు పెట్టిన, ఏ శుభకార్యం చేయాలన్నాచేయాలన్నా ముందుగా పూజలు అందుకునే వాడు. విజయాన్ని అందించేవాడు జ్ఞానానికి దిక్కు అందుకే విఘ్నాలను తొలిగించేవాడు ఆ వినాయకుడు అన్న ఆయన గురించి తెలుసుకోవాలన్న అందరికీ ఎంతో ఇష్టం.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

ఈ వినాయక చవితి రోజున ఆయన పుట్టుక గురించి వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం

వినాయక చవితి భారతీయులు జరుపుకొనే పండుగ ఒక ముఖ్యమైన పండుగ, మట్టి వినాయకుడి విగ్రహాలను వాడవాడలా ప్రతిష్టించుకొని ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన పుట్టినరోజు పురాణగాథల ప్రకారం వినాయక చవితి ని ఎందుకు జరుపుకుంటారంటే పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు.

ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు అందుకు ఆ రాక్షషుడు నీవు నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు, ఈ విషయం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి దేవికి తెలియడంతో మహావిష్ణువు దగ్గరికి వెళ్లి నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు ఉన్నట్లుగానే గజాసురుని ఉదరంలో నుండి పరమేశ్వరుని కాపాడమని కోరగా మహా విష్ణువు పార్వతీ దేవికి ధైర్యం చెప్పి పంపిస్తాడు.

పరమేశ్వరుడిని కాపాడటానికి మహావిష్ణువు ఈ విధంగా ఉపాయం ఆలోచించాడు గంగిరెద్దు మేళమే ఇందుకు సరైన ఉపాయం అని భావించి శివుడి ద్వారపాలకులైన నందిని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు.

అందుకు తనయుడైన గజాసురుడు ఏం కావాలో కోరుకొమ్మని చెప్పగా ఇది మహానందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇచ్చేయమని అడిగారు. ఆ కోరిక కోరింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని గ్రహించాడు గజాసురుడు.

తనకిక మరణం తథ్యం అని గ్రహించి గజాసురుడు శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని వేడుకున్నాడు. అభయమిచ్చిన తరువాత విష్ణు మూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు.

బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు, అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పాడు అపార్థా దానం చేయకూడదు, దుష్టులతో ఇటువంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచిన అట్లే అవుతుందని చెప్పాడు.

వినాయకుడు పుట్టుక గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, తన భర్త శివుడు కైలాసానికి వస్తున్నట్టు తెలుసుకున్న పార్వతి దేవి ఎంతగానో సంతోషించి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను తయారు చేసి ప్రాణం పోతుంది.

ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది, ఆ సమయంలో శివుడు కైలాసం చేరుకున్నాడు, లోపలికి వెళ్లనివ్వకుండా శివుడిని బాలుడు అడ్డుకున్నాడు, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్ళాడు.

పార్వతీ దేవి స్నానం చేసి ఆభరణాలతో శివుడి వద్దకు వచ్చింది, ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వాకిట్లో తనను అడ్డగించిన బాలుని సంవరించినట్టు శివుడు చెప్పాడు, ఆ వార్త తో పార్వతి దుఃఖించడం మొదలుపెట్టింది పార్వతి దేవి ని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు శివుడు.

ఆదిదంపతులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించారు అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చారు అందువలన గజాననుడిగా విజ్ఞేశ్వరుడు పేరు పొందాడు.

ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు అతని వాహనము నెమలి ఇలా ఉండగా ఒక రోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మేము ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించని కోరారు ఆ పదవికి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు.

ఈ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరు ముల్లోకములలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ఇక్కడికి ముందు ఎవరు వస్తారో వారికే ఈ పదవి అని అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన వాహనము అయినా నెమలి ని తీసుకొని వెళ్ళిపోయాడు.

విజ్ఞేశ్వరుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో పరమేశ్వరునితో ఈ విధంగా అన్నాడు నా బలాబలాలు తెలిసి కూడా మీరు ఇటువంటి షరతులు విధించడం సభమేనా, నేను మీ పాద సేవకుడిని కదా నామీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు విఘ్నేశ్వరుడు, అందుకు శివుడు దయతో నారాయణ మంత్రం చెపుతాడు.

ఈ మంత్రం ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది, షరతు విధించింది తండ్రే తరుణోపాయం చూపించింది తండ్రే కాబట్టి ఇంకా తాను గెలగలను లేదు కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షణ చేసి కైలాసము లో ఉండిపోయాడు.

అక్కడ కుమార స్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్లిన అప్పటికె గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులూ తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు, తన అహంకారానికి చింతించిన కుమారస్వామి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించు తన అన్నకు ఆధిపత్యం ఇవ్వాలని కుమారస్వామి శివుని కోరాడు.

ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు, ఆ రోజు భక్తులందరూ విఘ్నేశ్వరుడుకి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు.

విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తినితన వాహనానికి పెట్టి తీసుకెళ్ల గలినంత తీసుకోని భక్తాయాసంతో చీకటి పడే వేలకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు, ఆ విధంగా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు.

చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములు దొర్లుకుంటూ బయటకు వచ్చేసాయి, దీనికి పార్వతీదేవి దుఃఖిస్తూ చంద్రుని ఈ విధంగా శపించింది, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, అందుకని నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చెప్పింది పార్వతి దేవి.

ఇచ్చిన శాపాన్ని ఉపసమ్మరించుకొని బ్రహ్మ కోరగా, ఏ రోజయితే చంద్రుడు నాకుమారుడిని చూసి నవ్వడో ఆరోజు చంద్రుడిని చూడరాదు అని శాప విమోచనం కలుగ చేసింది, ఒకవేళ చూస్తే నీలాపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పింది. ఇలా నీలాపనిందలు ఏదుకొన్నావారిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నారుగా!

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి