స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఉత్తమ పుస్తకాలు

ఈ బ్లాగ్ పోస్ట్ లో మేము మీకు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి అవసరమైన ఉత్తమమైన పుస్తకాలు గుంచి తెలియజేస్తున్నాము. 2020 కరోనా తర్వాత స్టాక్ మార్కెట్ హాట్ టాపిక్ గా మారిపోయింది.

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు

స్టాక్ మార్కెట్ ఇంగ్లీష్ బుక్స్

One Up On Wall Street

ఈ పుస్తకం రచయిత పీటర్ లించ్ ఒక అమెరికన్ పెట్టుబడిదారు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్. 1977 మరియు 1990 మధ్య ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాగెల్లాన్ ఫండ్ నిర్వాహకుడిగా, లించ్ సగటున 29.2% వార్షిక రాబడిని సాధించాడు, ఇది స్టాక్ మార్కెట్ సూచికను రెట్టింపు చేయడం మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కలిగిన మ్యూచువల్ ఫండ్‌గా నిలిచింది. అతని 13 సంవత్సరాల పదవీకాలంలో, నిర్వహణలో ఉన్న ఆస్తులు విలువ అమెరికన్ డాలర్ల లో 18 మిలియన్ల నుండి 14 బిలియన్లకు పెరిగాయి. ఈ  పుస్తకం పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక సామాన్యుడు  కావాల్సిన  ముఖ్యమైన ప్రాథమిక విధులను సూచిస్తుంది. పెట్టుబడి పెట్టడం నుండి, ఎలా, ఎప్పుడు, దీర్ఘకాలిక పెట్టుబడి విధానం వరకు, ప్రతి అంశం చక్కని ఉదహరణ ల తో వివరించారు.

The Intelligent Investor

ఈ పుస్తకం రచయిత బెంజమిన్ గ్రాహం బ్రిటిష్ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ మరియు పెట్టుబడిదారుడు. విలువ పెట్టుబడి పితామహుడు గా పిలుస్తుంటారు. ఈ పుస్తకాన్ని  స్టాక్ మార్కెట్  బైబిల్ అని అంటారు.  వారెన్ బఫ్ఫెట్ 20 ఏళ్ళ వయసులో ఈ పుస్తకాన్ని చదివాడు మరియు గ్రాహం బోధించిన విలువ పెట్టుబడిని తన సొంత పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్మించడం ప్రారంభించాడు. ఈ పుస్తకం లో పెట్టుబడి విధానం, పెట్టుబడిదారుల మనస్తత్వశాస్త్రం, కొనుగోలు మరియు పట్టు పెట్టుబడి, ప్రాథమిక విశ్లేషణ,  వైవిధ్యీకరణ పెట్టుబడి , భద్రత మొదలైనవి వివరించారు.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

Stocks to Riches

భారతీయ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకం చాలా సరళమైన మరియు అర్థమయ్యే భాషలో వ్రాయబడింది. రచయిత ‘పరాగ్ పరిఖ్’ ఈ పుస్తకంలో స్టాక్ మార్కెట్ల గురించి తనదైన కోణం లో గమనించిన విషయాలను వివరించారు.  స్టాక్ మార్కెట్ లోని ప్రారంభ దశలో తప్పులను నివారించాలనుకుంటే, మార్కెట్లోకి ప్రవేశించే ముందు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకం స్టాక్ మార్కెట్ అనుభవాలని పరిచయం చేస్తుంది.

The little book that beats the market

ఈ పుస్తక రచయిత జోయెల్ గ్రీన్ బాల్ట్   ఒక అమెరికన్ విద్యావేత్త, హెడ్జ్ ఫండ్ మేనేజర్, పెట్టుబడిదారు. ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం యొక్క వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థి మరియు కొలంబియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అనుబంధ ప్రొఫెసర్.  ఈ పుస్తకం స్టాక్‌లను ఎంచుకోవడానికి ‘మ్యాజిక్ ఫార్ములా’ గురించి వివరిస్తుంది. గ్రీన్ బాల్ట్  30 మంచి కంపెనీలను కొనాలని చెప్తుంది. అధిక ఆదాయ దిగుబడి మరియు మూలధనంపై అధిక రాబడి కలిగిన చౌక స్టాక్స్ ఎంచుకునే విధానం  యొక్క తన మ్యాజిక్ ఫార్ములా యొక్క విజయాన్ని  ఈ పుస్తకం లో పేర్కొన్నాడు.

Common Stocks and Uncommon Profits

ఫిలిప్ ఫిషర్ అనే రచయిత ఈ కామన్ స్టాక్స్ మరియు అసాధారణ లాభాలు అనే పుస్తక రచయిత. అతను వారెన్ బఫ్ఫెట్‌పై తీవ్ర ప్రభావం చూపాడని చెప్తారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన అతని పెట్టుబడి నియమాలు ఇప్పటికి పెట్టుబడిదారులచే ఉపయోగంలో ఉన్నాయి,  చాలామంది దీనిని సువార్తగా భావిస్తారు. బఫెట్ స్వయంగా సిఫారసు చేసిన ఈ పుస్తకం క్లాసిక్లలో ఒకటి. ఈ పుస్తకం బెన్ గ్రాహం రాసిన ‘ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్’ దాదాపు అదే సమయంలో ప్రచురించబడింది.

Stock Market Books in Telugu (స్టాక్ మార్కెట్ తెలుగు బుక్స్)

1. ది ప్రోఫెట్

2. స్టాక్ మార్కెట్ లో నష్టాలను నిరోధించడం మరియు నిలకడగా లాభాల్ని సంపాదించడం ఎలా

3. స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ క్యాన్డీల్ స్టిక్ పాటర్న్ – 1

4. స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందడం ఎలా ?

5. స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ క్యాన్డీల్ స్టిక్ పాటర్న్ – 2

Best Books to learn stock market స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు మీరు నిజమైన స్టాక్ మార్కెట్ రహస్యాలను కాని, విషయాలని కాని నేర్చుకోవాలంటే పైన తెలిపిన పుస్తకాలని చదివే ప్రయత్నం చేయండి. 

6. Stock Market Technical Analysis Chart patterns

మీ ప్రేమను పంచుకోండి

One comment

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి