(Walking) నడక వలన కలిగే లాభాలు ఏమున్నాయి?

మనకి ఎప్పుడైతే శారీరక శ్రమ తగ్గుతుందో, సాధారణంగా అందరూ వైద్యులు ఇచ్చే సూచన నడక. మనం నడవటం వలన కలిగే లాభాలు ఎంటో తెలిసుకుందాం.

1 ఉదయాన్నే నడవటం వలన మీ రోజు వారి దిన చర్య ఉత్సాహాన్ని మరియు చైతన్యాన్ని కలిగిస్తుంది.

2. నడక మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి గొప్ప మార్గం, దీని వలన మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. సగటున 30 నిమిషాలు నడవడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గించవచ్చు.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

3. వేకువజామున నడవటం వలన మీకు సహ్జసిద్దమైన శక్తి ని పెంపొందించటంలో తోడ్పతుడుతుంది.

4. రోజువారీ 30 నిమిషాల నడక వలన టైప్ -2 డయాబెటిస్ మరియు ఊబకాయం రెండింటిని అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల మీ శరీరానికి ఇన్సులిన్‌కు ప్రతిస్పందించే సామర్థ్యం పెరుగుతుంది కూడా.

5. మీ శరీరం యొక్క సహజ మానసిక స్థితి మెరుగు పరిచే ఎండార్ఫిన్లు మరియు సెరోటోనిన్లను విడుదల చేయడానికి ఉదయం మరియు సాయంత్రం నడక సహాయపడుతుంది.

6. శరీరం చురుకుగా ఉండటం వల్ల మెలటోనిన్ (నేచురల్ స్లీప్ హార్మోన్) యొక్క ప్రభావాలను పెంచుతుంది, ఇది మీకు నిద్రపోవడానికి సహాయపడుతుంది.

7. నడక ప్రతి రోజు చేయడం వలన మెదడుకు రక్త సరఫరాను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు, దీని వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.

8. మీ రోజు వారి నడకలో భాగం గా మీ స్నేహితులని కలిసే ప్రయత్నం చేయండి. దీని వలన మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది.

9. రోజు నడక ఒకే చోట కాకుండా, రోజు ఒక కొత్త ప్రదేశాన్ని అన్వేషించే ప్రయత్నించండి. దీని వలన ఒకే మూస ధోరణి లేకుండా ఉంటుంది.

10. నడక వలన మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉండే పరిసరాల్ని గమనిస్తూ ఉండండి. దీని వలన వాతావరణ మార్పులను తెలుసుకోండి.

మీరు ఉదయం మేల్కొన్నప్పుడు, వ్యాయామంలో  మీ ప్రాధాన్యత జాబితాలో నడకను ఉంచుకునే ప్రయత్నం చేయండి. దీనివలన ఎన్నో లాభాలను పొందండి.

వ్యాయామం మొదలు పెట్టె ముందు మీ వైద్యుని సలహా తప్పక తీసుక

మరిన్ని ఆరోగ్య విషయాల కోసం తెలుగు గురూజీ .com ఆరోగ్యం Health

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి