యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఫిజిసిస్ట్ మరియు ఇతర పోస్టులకు 34 పోస్టులకు నియామకాల కొరకు నోటిఫికేషన్ జారి చేసింది. ఆసక్తి మరియు అర్హుత గల అభ్యర్థులు 31 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకొనవలెను.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదీ: 11 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నియామకాలు
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 2 పోస్టులు
మెడికల్ ఫిజిసిస్ట్: 4 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్: 10 పోస్టులు
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 18 పోస్టులు
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు కనీస కంప్యూటర్ పరిజ్ఞ్యానం అవసరం.
మెడికల్ ఫిజిసిస్ట్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు పోస్ట్ M.Sc. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రేడియోలాజికల్ లేదా మెడికల్ ఫిజిక్స్ డిప్లొమా.
పబ్లిక్ ప్రాసిక్యూటర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు కనీస కంప్యూటర్ పరిజ్ఞ్యానం అవసరం.
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
సాధారణ అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు.
సాధారణ అభ్యర్ధులు మరియు ఇతరులు రూ. 25/- దరఖాస్తు రుసుము చెల్లించవలెను.
ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు రుసుము నిభందన వర్తించదు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో పైన తెలిపిన పోస్టులకు నియామకాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 31 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.