ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రారంభ మరియు అధునాతన ట్రేడర్ల కోసం ఎన్నో కంపెనీల ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే ఎవరి లాభాలు వారికీ ఉన్నాయి, అలాగే వాటిలో లోపాలు కూడా ఉన్నాయి. ఎంచుకునే ముందు పూర్తీ స్థాయి లో విశ్లేషణ తర్వాత మాత్రమే ఎంచుకోవాలి.
అలాగే ఎవరో సలహా ఇచ్చారని మాత్రం తీసుకోవడం ఎంతో ప్రమాదం. చాలా మంది మార్కెట్లో మా రిఫరల్ ద్వారా తీసుకుంటే ఉచిత కాల్స్ ఇస్తామని చెప్తుంటారు. అలాంటి వారి తో జాగ్రత్తగా ఉండటం మేలు.
సాధారణంగా అలా ఉచిత కాల్స్ ఇచ్చే వాళ్ళు ఎంచుకునే కంపెనీలు సుమారు ఒక్కోటి రూ.800.00 నుండి రూ.2000 పైనే ఉంటాయి. వాటి పై రూ. 4 నుండి రూ.8 లకి టార్గెట్ ఇస్తుంటారు.
దీని వల్ల మీరు పెట్టె పెట్టుబడి వారికీ కమీషన్ల రూపం లాభం తెస్తుంది కాని మీకు ఏమాత్రం లాభం రాదు అన్న విషయం తెలుసుకోండి.
- మీరు రోజు వారి ట్రేడింగ్ చేయాలనీ అనుకుంటే డిస్కౌంట్ బ్రోకర్లను ఎంచుకోవడం మంచిది. వాళ్ళు మాత్రమే మీకు తక్కువ ట్రేడింగ్ చార్జిలను తీసుకుంటారు.
- మీరు స్టాక్ కంపెనీల లో దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక మంచి పూర్తీ సేవలు అందించే సంస్థను ఎంచుకోవడం మంచిది.
- కొన్ని సంస్థలు వార్షిక రుసుం తక్కువగా మరియు ట్రేడింగ్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తుంటాయి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి.
- కొంతమంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో భాగంగా ఆప్షన్స్ స్ట్రాటజీ బిల్డర్, ఆప్షన్స్ స్ట్రాటజీ కాలిక్యులేటర్, ఆప్షన్స్ ట్రేడింగ్ ఎనాలిసిస్ టూల్స్, రీసెర్చ్ టూల్, బ్యాక్ ఆఫీస్, అడ్వాన్స్డ్ చార్టింగ్ వంటి అధునాతన సాధనాలను ఉచితంగా ఇస్తుంటారు, అలాంటి వాటిని తీసుకోవడం ఉత్తమం.
- కొంతమంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో, ఖాతా నిర్వహించాలంటే కనీస మార్జిన్ ఉంచాల్సి ఉంటుంది. వాటి గురించి ముందే తెలుసుకోండి.
- దీనితో పాటు కొంతమంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో తక్కువ మార్జిన్ తో ఎక్కువ ట్రేడింగ్ చేసుకునే సదుపాయాలు ఇస్తుంటారు. వాటి పై పూర్తీ అవగాహనతో మాత్రమే అలాంటివి ఎంచుకోండి.
- ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు ఫ్రంట్-ఎండ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్, వెబ్ బ్రౌజర్ ఆధారిత ట్రేడింగ్ వెబ్సైట్ మరియు మొబైల్ ట్రేడింగ్ (ఆప్) తో ఇలా ఎన్ని విధాలుగా వారు సదుపాయాలు కల్పిస్తున్నారో గమనించండి.
- మీరు ఎంచుకునే ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూత్యుఅల్ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టవచ్చో లేదో ఆరా తీయండి.
- మీరు ఎంచుకునే ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ద్వారా నేరుగా ఐ.పి.ఓ ల ను కూడా కొనవచ్చో లేదో తెలుసుకోండి.
- చివరగా మీరు ఎంచుకున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ట్రేడింగ్ చేయుటకు వీలుగా మరియు సులువుగా ఉందొ లేదో ముందే పరీక్షించి తీసుకోండి.
మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల కోసం teluguguruji.com