08.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

మోటోజి-9 మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లోఅమ్మకాలు ప్రారంభం.

మోటోరోల కంపెని 6000 mAh బ్యాటరీ సామర్ధ్యం, 64 MP ట్రిపుల్ కెమెరా, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం మరియు  స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో శక్తివంతమైన కొత్త మొబైల్  మోటో జి-9 పవర్ పేరు తో  విడుదల చేయడం జరిగింది. ఫ్లిప్ కార్ట్ లో 15వ తేది   డిసెంబర్ 2020 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించబోతుంది. దీని ధర రూ.11,999/- అని ట్విట్టర్ లో తెలిపింది.  

షియోమి రెడ్ మీ – 9 సంభందింఛి టీసర్ ను ట్విట్టర్ లో విడుదల చేసింది.

షియోమి ఇండియా భారత దేశం లో కొత్త ప్రోడక్ట్ ను తీసుకురావడం కోసం ఒక టీసర్ ను ట్విట్టర్ లో విడుదల చేసింది. పవర్ ప్యాక్ అనే హాష్ ట్యాగ్ తో ఉంది.  దీనిని గమనించిన ఫోల్లోవర్స్ అందరూ రెడ్ మీ – 9 రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిని రాబోయే కాలంలో ఎం జరుగుతుందో గమనించాలి.

 

ఆపిల్ మరియు గూగుల్ యొక్క COVID కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్ ఆప్ ను కాలిఫోర్నియాలో విడుదల చేస్తుంది

కాలిఫోర్నియా గవర్నర్ డిసెంబర్ 10, గురువారం కాలిఫోర్నియా రాష్ట్రం లో COVID కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రత్యేక ఆప్ ను  ప్రజలకు విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ లో  ప్రకటించారు. ముఖ్యంగా కాలిఫోర్నియా ఆపిల్ మరియు గూగుల్ లకు నివాసంగా ఉంది. ఈ రెండు సంస్థలు కలిసి ఈ ఆప్ ను తయారు చేయడం విశేషం. దీనిని ఆపిల్ సీఈఓ టిం కుక్ రెట్వీట్ చేయడం విశేషం.

భారతదేశంలో 2021 లో 5 జి సేవలను ప్రారంభించడానికి రిలయన్స్ జియో ప్రణాళికలు చేయబోతుంది.

రిలయన్స్ 2021 నాటికి 5 జి కనెక్టివిటీని ప్రారంభించ బోతునట్లు ముకేశ్ అంబానీ ప్రకటించినట్లు  ఇండియా మొబైల్ కాంగ్రెస్ ట్విట్టర్ లో ప్రకటించింది. టెలికాం ఆపరేటర్ల కోసం 5 జి స్పెక్ట్రం ఇంకా వేలం వేయబడలేదు. ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.  

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!