07.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

 

MI QLED TV ని షియోమి 16 డిసెంబర్ 2020 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అమ్మకాలు ప్రారంభం:

షియోమి QLED TV టీవీ రంగం లో పోటిని ఇవ్వడానికి 16 డిసెంబర్ 2020 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించబోతుంది. షియోమి ట్విట్టర్‌లో ప్రకటించింది. “క్వాంటం లీప్స్ అహెడ్” అనే క్యాప్షన్‌తో పాటు తేదీ మరియు సమయాన్ని హైలైట్ చేస్తుంది. అయితే ఎంత గట్టి పోటి ఇస్తుందో రాబోయే కాలం లో చూడాలి.

భారతదేశంలో వివో-వి 20 ప్రో ఆండ్రోయిడ్ 11 అప్‌డేట్ వచ్చేసింది

వివో వి 20 ప్రో డిసెంబర్ 2 న భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించింది, ఇదిద్ నిజం గా  వన్‌ప్లస్ నార్డ్‌కు గట్టి పోటి ఇస్తుంది. దానిలో భాగం గా వివో వి 20 ప్రో 5 జి భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన తర్వాత,  ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేసింది. అలాగే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ డిసెంబరులో V20 మరియు V20 SE లలో కూడా ఆండ్రోయిడ్ 11 ను OTA అప్‌గ్రేడ్‌ ను విడుదల చేసింది.

ఫ్లిప్‌కార్ట్ లో  మొబైల్స్ బొనాంజా అమ్మకాలు ప్రారంభం 10వ డిసెంబర్ వరకు.

ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ ఎస్‌ఇ, ఇన్ఫినిక్స్ నోట్ 7, ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 3 మరియు అనేక మోడల్స్ మొబైల్స్ బొనాంజా అమ్మకానికి భారీ తగ్గింపు తో ఇస్తున్నారు. నాలుగు రోజుల అమ్మకాలు ఈ సోమవారం నుండి గురువారం వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఆపిల్, శామ్‌సంగ్, రియల్‌మే మరియు షియోమి వంటి బ్రాండ్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు ల పై తగ్గింపు కూడా అందిస్తోంది.

నోకియా 6వ తరం వైర్‌లెస్ నెట్‌వర్క్‌ (6-G) పై పరిశోధనలకు ఎంపికైంది

తదుపరి తరం వైర్‌లెస్ నెట్‌వర్క్‌లపై పరిశోధన కోసం యూరోపియన్ కమిషన్ 6 జి ఫ్లాగ్‌షిప్ అయిన హెక్సా-ఎక్స్ కోసం నోకియా మొత్తం ప్రాజెక్ట్ లీడర్‌గా ఎంపికైంది.  ఈ విషయాన్ని స్వయం గా నోకియా ట్విట్టర్ లో ద్రువీకరించింది.

మొబైల్ గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: సీజన్ 13 రైడ్-హాలిడే మ్యాప్ విడుదల చేసింది.

సుప్రసిద్ధ మొబైల్ గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ  తన ప్రసిద్ధ రైడ్ మ్యాప్ ను  క్రిస్మస్ నేపథ్య వెర్షన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. రైడ్-హాలిడే అని పిలువబడే ఈ కొత్త మ్యాప్‌లో క్రిస్మస్-నేపథ్య లైట్లు, బహుమతులు, స్నోమెన్ మరియు మరిన్ని వంటి అదనపు మంచుతో కూడిన సదుపాయాలతో ఉన్నట్లు ప్రకటించింది.  అక్టోబర్‌లో డెవలపర్లు విడుదల చేసే స్టాండ్‌ఆఫ్ యొక్క హాలోవీన్ వెర్షన్ లాగానే ఇది కూడా ఉండవచ్చు.

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!