06.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

అమెజాన్ షాపింగ్ యాప్ నుండి ఇకపై క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా కట్టే సదుపాయాన్ని కల్పించింది

ఇకపై అమెజాన్ పే లో మొబైల్ ఫోన్ రీఛార్జ్ తో పాటుగా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా చెల్లింపు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఇది నిజంగా పేటీఎం లాంటి సంస్థలకు పోటీ అని చెప్పాలి సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్  చెల్లింపు కోసం  ఆన్ లైన్  బ్యాంకింగ్ కోసం లేదా పేటీఎం లాంటి ఆప్ లను వాడడం జరుగుతుంది. ఇప్పుడు వీటి స్థానంలో అమెజాన్ కూడా ఒక పోటీదారులుగా మారింది.  ఇప్పటికే సొంత ఒ.టి.టి  స్ట్రీమింగ్ కలిగి ఉండటం కూడ మిగిలిన కంపెనీలకు పోటిగా ఉంది.

 

రేపు మధ్యాహ్నం నుండి మోటో జి-5  మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభం.

మోటోరోల కంపెని మొదటి 5- జి మొబైల్ ఫోన్ మోటో జి-5 ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఫోన్ ని మోటో రోలా కంపెని యొక్క  ఫ్లాగ్ షిప్  ఫోన్ గా చెప్పుకోవచ్చు. ఇది  6 GB ర్యాం మరియు  మరియు 128 GB మెమరీ తో  20999 రూపాయలకి అందుబాటులో ఉంది.  ఇందులో స్నాప్ డ్రాగన్ 750G  ఉండటం మంచి విషయం అనే చెప్పాలి. 5000 యం.ఎ.హెచ్ బ్యాటరీ సామర్ద్యం తో ఉంది. (దీనిపైన రూ.1000 తగ్గింపు కూడా ఉంటుంది హెచ్.డి.యఫ్.సి బ్యాంకు వినియోగదారులకి)

 

ఎలోన్ మస్క్ టెక్సాస్‌కు వెళ్లాలని సమాయత్తమవుతున్నట్లు సమాచారం

నిజంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటే సామాన్యులకే కాదు సంపన్నులకు కూడా భయమే. అందుకేనేమో టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ కాలిఫోర్నియా నుండి టెక్సాస్‌కు వెళ్లాలని సమాయత్తమవుతున్నట్లు సమాచారం, ఈ పని వల్ల అతనినకి భారీ వ్యక్తిగత ఆదాయపు పన్ను బిల్లు నుండి రక్షించగలదు. టెక్సాస్‌ రాష్ట్రం లో  వ్యక్తిగత ఆదాయపు పన్ను లేద కాబట్టి  టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓలకు భారీగా ప్రయోజనం లభిస్తుంది.

 

శామ్‌సంగ్ మొబైల్ కంపెని 600 ఎంపి కెమెరా సెన్సార్‌లకోసం ప్రయోగాలు ప్రారంభించింది.

మొబైల్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ ఇప్పుడు నిజంగా 600 ఎంపి కెమెరా సెన్సార్‌ల ఏర్పాటు పని లో నిమగ్నమైనట్టు సమాచారం. నిజానికి ఇది 4K మరియు 8K స్ట్రీమింగ్ చూడాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా తాయారు చేస్తున్నట్లు ఉంది. మారుతున్న కాలానికి ఇది రాబోవు మొబైల్ ఫోన్ లలో కలిగే అత్యున్నత మార్పులకు ఇది ప్రారంభం అనే చెప్పాలి.

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!