ఇప్పటికే వాట్స్ ఆప్ తన కొత్త సేవా నిబంధనలను ఫెబ్రవరి నుండి తెస్తున సందర్భంలో ఇప్పుడు వీడియో కాల్స్ మరియు ఆడియో కాల్స్ కంప్యూటర్ నుండి చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుందని నిపుణులు ట్విట్టర్ ద్వారా అభిప్రాయ పడుతున్నారు. దీని తో పాటు క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం కూడా వస్తే బాగుంటుందని వాట్స్ ఆప్ వినియోగదారులు భావిస్తున్నారు.
ఆపిల్ వినియిగాదారుల ఫోరం లో ఐ ఫోనే 11 వినియోగదారులు అందరూ టచ్ స్క్రీన్ సరిగ్గా పని చేయడం లేదని విరివిగా అడుగుతున్నారు. అయితే దీని పైన స్పందించిన ఆపిల్ కంపెని తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎవరికైతే టచ్ స్క్రీన్ విషయం లో సమస్యలు వస్తుంటే వారికీ ఉచితం గా టచ్ స్క్రీన్ మార్చి ఇవ్వబడుతుందని తెలిపింది. దీని కోసం వినియోగదారులు ఐ ఫోనే 11 సీరియల్ నెంబర్ ను ఆన్ లైన్ లో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
బాండ్ సినిమాలు చూడాలనుకునే వారికి నిజం ఇది మంచి వార్త. దాదాపుగా 22 జేమ్స్ బాండ్ చిత్రాలు యు ట్యూబ్ మరియు పీకాక్ టీవీ లో ప్రదర్శించిబోతునట్లు సమాచారం. సీన్ కానరీ, రోజర్ మూర్, తిమోతి డాల్టన్, పియర్స్ బ్రాస్నన్ మరియు జార్జ్ లాజెన్బీ లాంటి హీరోలు నటించిన చిత్రాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయని ప్రేక్షకుల అభిప్రాయం. సీన్ కానరీ ఈ సంవత్సరం అక్టోబర్ లో మరణించడం నిజం బాండ్ అభిమానులకు బాధ కలిగించింది. ఇది ఇలా ఉంచితే ఇప్పటికి కొన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ కూడా ఇవ్వబోతునట్లు సమాచారం అయితే దీనికి సబ్ స్క్రిప్ షన్ చెల్లించవలెను.
విండోస్ ఆపరేటింగ్ సిస్టం అభిమానులకు మైక్రోసాఫ్ట్ కొత్తగా అదే థీం తో ఉన్న స్వెట్టర్ లను అమ్మకాని ఆన్ లైన్ లో సిద్దం గా ఉంచింది. అయితే ఇవి ఎక్స్ బాక్స్ గేర్ ఆన్ లైన్ లో అందుబాటు లో ఉంది. విండోస్ ఆక్స్ పి మరియు విండోస్ 95 మరియు యం.యెస్ పెయింట్ థీమ్ లు అందు బాటు ఉన్నాయి.
ఈ రోజు నుండి భారతదేశంలో కొత్త వినియోగదారులందరికీ నెట్‌ఫ్లిక్స్ ఉచితం. నెట్‌ఫ్లిక్స్ యొక్క మొత్తం లైబ్రరీకి రెండు రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందాలని అనుకునే వారు మీరు ఇంటర్నెట్ బ్రౌజర్‌తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ కోసం సైన్ అప్ చేయవలసి ఉంటుంది. ఉచిత నెట్‌ఫ్లిక్స్ కోసం సైన్ అప్ చేయడం గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్ వంటి చెల్లింపు వివరాలను అందించాల్సిన అవసరం లేదు. మీకు కావలసిందల్లా పేరు, ఇమెయిల్ చిరునామా లేదా ఫోన్ నంబర్ మరియు పాస్వర్డ్. అయితే అమెజాన్ ప్రైమ్ మరియు హాట్ స్టార్ లాంటి కంపెనీలు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించాయి. వాటి తో పోల్చుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఇంకా చౌక్ ధరలకు అందించాల్సిన అవసరం ఉంది.