04.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

IOS 14.2 అప్ డేట్ తో ఆపిల్ యూజర్లు వారి సభ్యత్వాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.

కొత్తగా  వచ్చిన IOS 14.2 అప్ డేట్ తో, ఆపిల్  వినియోగదారులు వారి సభ్యత్వాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునే సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా మరి కొంత మంది వినియోగదారులను చేరుకునే ప్రయత్నం చేసింది. అయితే దీని పై డెవలపర్  వారి అప్లికేషన్ కోసం కుటుంబ భాగస్వామ్య లక్షణాన్ని చేర్చాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలి కూడా.

 

GOOGLE ఫోటోలు డైనమిక్ వాల్‌పేపర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.

ఒకే వాల్‌పేపర్‌లపై విసుగు చెందిన వ్యక్తులకు ఒక వరం. గూగుల్ ఫోటోస్ వెర్షన్ 5.22  నుండి క్రొత్త ఫీచర్ వినియోగదారులు వారి స్వంత ఫోటోల జాబితా నుండి డైనమిక్ వాల్‌పేపర్‌ను సెట్ చేయడానికి వీలుగా డిజైన్ చేయబడింది. దీని ద్వారా ఫోటోలు ఎప్పటికప్పడు మారుతూనే ఉంటాయి.

 

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సినిమాలు ఇక పై HBO మాక్స్ మరియు థియేటర్లలో కూడా విడుదల చేయబడుతుంది.

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ 2021 లో విడుదల కానున్న అన్ని సినిమాలను అమెరికాకు చెందిన స్ట్రీమింగ్ సర్వీసు HBO మాక్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  థియేటర్లలో విడల అయ్యే తేదీలలో HBO మాక్స్ లో కూడా ప్రసారం చేయబడతాయి. ఇందులో డెనిస్ విల్లెనెయువ్ యొక్క “డూన్”, లానా వాచోవ్స్కీ యొక్క “ది మ్యాట్రిక్స్ 4” మరియు జేమ్స్ గన్ యొక్క “ది సూసైడ్ స్క్వాడ్” ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ వారి మొత్తం స్లేట్ 2021 సినిమాలను ఏకకాలంలో HBO మాక్స్ మరియు థియేటర్లలో విడుదల చేస్తుంది.

 

ఫ్లిప్‌కార్ట్ 2GUD స్థానిక సేవ తో ప్రముఖ రిటైల్ దుకాణాలను  వినియోగదారులను కనెక్ట్ చేయబోతుంది.

ఫ్లిప్‌కార్ట్ కొత్త 2GUD లోకల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది భారతదేశంలోని వినియోగదారుల కోసం ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్లను మరియు షాపింగ్ మాల్‌లను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే  ఫ్లిప్‌కార్ట్ యొక్క పునరుద్ధరించిన వస్తువుల ప్లాట్‌ఫారమ్ 2GUD లో అందుబాటులో ఉంది. 2GUD లోకల్ యొక్క మొట్టమొదటి డిజిటల్ ఈవెంట్ బెంగళూరులోని KLM ఫ్యాషన్ మాల్ తో జరుపబడింది.

 

నల్లజాతీయులు, ముస్లింలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయకుండా ఉండేలా ఫేస్బుక్ హేట్ స్పీచ్ పాలసీ సవరించబడింది

ఫేస్బుక్ హేట్ స్పీచ్ పాలసీ సవరించి ఎవరైనా వారి కామెంట్లు నల్లజాతీయులు, ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన యెడల వారి ఒక్క పేస్ బుక్ సభ్యత్వం రద్దు కాబడుతుంది.

 

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో చందాదారులు పెరిగారు మరియు  వోడాఫోన్ ఐడియా చందాదారులు తగ్గారు: TRAI

భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ చందాదారులను చేర్చుకోగా, వోడాఫోన్ ఐడియా సెప్టెంబర్ నెలలో వినియోగదారులను కోల్పోయిందని తాజా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా తెలిపింది. ఎయిర్టెల్ 3.8 మిలియన్ల కొత్త చందాదారులను చేర్చుకుంది మరియు  జియో 1.46 మిలియన్ల కొత్త చందాదారులను చేర్చుకుంది.

 

గూగుల్ ప్లే మ్యూజిక్ చివరకు ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం లేదు.

యు ట్యూబ్ మ్యూజిక్ ప్రారంభం  ద్వారా గూగల్ తన పాత గూగుల్ ప్లే మ్యూజిక్ ను నిలిపి వేసింది. దీని ద్వారా గూగుల్ వినియోగదారులను యు ట్యూబ్ మ్యూజిక్ కు మళ్ళించే ప్రయత్నం  చేసింది. నెల వారి చందా మరియు కుటుంబ సభ్యుల చందా రూపం లో అందించ బడుతుంది.

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!