స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు సంపాదించాలంటే చేయకూడని నవరత్నాలు అనిపించే పనులు

మీరు ఈ వ్యాసం పేరు చదివి ఆశ్చర్యపోకండి… ఎవరైనా ఎక్కువ లాభాల కోసం ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ మనకి కావాల్సింది లాభాలు కాదు, ముందు నష్టాలు రాకుండా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరూ, అంటే మన పెట్టుబడి స్థిరం గా ఉంటె లాభం ఈ రోజు కాకుండా రేపు అయినా వస్తుంది.

నష్టాలను తగ్గించుకుంటూ లాభాలు రావాలంటే చేయకూడని పనులు ఈ క్రింద తెలుపబడినవి.

  1. సరైన పరిశోధన లేకుండా ఎటువంటి షేర్లు కొనరాదు లేదా అమ్మరాదు.

కొందరు  స్టాక్ మార్కెట్ లోకి వచ్చాం కదా అని ఎదో ఒక షేర్ కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటారు. పూర్తీ నష్టం వచ్చిన తర్వాత వాటి నుండి బయట పడి నష్టాలు వచ్చాయని చెప్పుకుంటారు.

  1. మొత్తం పెట్టుబడి స్టాక్ మార్కెట్ లో పెట్టరాదు.

అలాగే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం స్టాక్ మార్కెట్ లో పెడితే నష్టం వస్తే పరిస్థితి ఏంటి అని అలోచించి అడుగులు వేయాలి. లాభాల ఆశలో నష్టాలు వస్తాయని  మరిచి పోకూడదు.

3.  ఉచిత సలహాను నమ్మి ఏది కొనవద్దు లేదా అమ్మవద్దు.

ఇంకొంత మంది యు ట్యూబ్ లేదా సామాజిక మాధ్యమాల లో చూసి లేదా స్నేహితులకి లాభాలు వచ్చాయని, స్నేహితులు చెప్పిన వెంటనే వీరు కూడా అవే కంపెని షేర్లను కొని నష్టాలను చూస్తుంటారు.

  1. మార్కెట్ తో పోటి పడటం చేయకూడదు.

మరికొంతమంది మార్కెట్ తో పోటి పడి మరి షేర్లను కొంటు, అమ్ముతూ ఉంటారు. పెరిగిన వెంటనే కొని తిరిగి పెరుగుతుందని ఆశపడుతుంటారు. ఇలా ఎప్పడు జరుగదు అంటే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా పెరగటం కాని, స్థిరంగా తగ్గడం కాని జరగదు. మార్కెట్ ను ఊహించడం చేయకండి.

  1. ఊపిక, సహనం లేకపోవడం.

కొంతమంది కొన్న షేర్ పెరగకపోవటం కాని, తగ్గక పోవటం కానీ జరగటంతో వాటిని వెంటనే అమ్మేస్తారు. అవి  అమ్మిన తర్వాత పెరిగితే చాలా మంది బాధ పడుతుంటారు.

  1. పెట్టుబడిని జూదంగా తీసుకోకండి.

స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యాపారం లాంటిది, లాభాలు మెల్లగాను నష్టాలు తొందరగా వస్తుంటాయి అని అనుకుంటూ ఉండాలి. లాభాలు త్వరగా సంపాదించడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు. అలా అయితే అందరూ స్టాక్ మార్కెట్ నే ఎంచుకుంటారు కదా.

  1. గుంపు నిర్ణయాలను అనుసరించవద్దు

చాలా మంది ఈ స్టాక్ అందరూ కొంటున్నారు కదా అని కొని నష్టపోతుంటారు. ఇది చాలా ప్రమాదం, సరైన అవగాహానా లేకుండా పెట్టుబడి పెట్టకండి.

  1. అనవసరమైన నష్టాలను తీసుకోకండి.

ఏదైనా పెట్టుబడి పెట్టేముందు దాని నష్టాన్ని అంచనా వేసి ఒక వేళ మీ అంచనాని మించి నష్టం వస్తే వెంటనే దాని నుండి బయటపడండి. అది పెరుగుతందిలే అనే అపోహలను పెంచుకోవద్దు. దాని వలన ఎక్కువ నష్టాలను చూడాల్సి వస్తుంది.

  1. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి.

పోయిన నష్టాన్ని ఒకే రోజు లాభాలుగా మార్చాలనే నిర్ణయాలను తీసుకోకండి. అది ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి నిర్ణయాల వలన మీ పెట్టుబడి మొత్తం ప్రమాదాల్లో పడే అవకాశం ఎక్కువ.

స్టాక్ మార్కెట్ లో  పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు త్వరగా ధనవంతులు అవుతారు అనే ఆలోచన ఉంటె వెంటనే దానిని తీసి వేయండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా హాని కలిగిస్తుంది.

మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం నేర్చుకోండి అంటే మీ పెట్టుబడి  ఏదైనా ఒకే కంపెని లో కాకుండా వేరు వేరు రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడి పెట్టండి. ఇది మీ పెట్టుబడి ని స్థిరమైన సమతుల్యం చేయడంలో మీకు సహాయపడుతుంది.

Secretes to earn profits in Stock market

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు డబ్బులు సంపాదించడం చాలా తేలిక అని తెలుగు సినిమా లో హీరోలు చెప్పే మాటలు విని స్టాక్ మార్కెట్ లో అతి తక్కువ పెట్టబడి తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికీ ఈ రహస్యాలు Secretes to earn profits in Stock market ఎంతో లాభం చేకూర్చుతాయి. నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఒక ప్రత్యేక నేర్పు. ఎంతో […]

మరింత సమాచారం కోసం
chart 840331 1920

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రారంభ మరియు అధునాతన ట్రేడర్ల కోసం ఎన్నో కంపెనీల ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే ఎవరి లాభాలు వారికీ ఉన్నాయి, అలాగే వాటిలో లోపాలు కూడా ఉన్నాయి. ఎంచుకునే ముందు పూర్తీ స్థాయి లో విశ్లేషణ తర్వాత మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఎవరో సలహా ఇచ్చారని మాత్రం తీసుకోవడం ఎంతో ప్రమాదం. చాలా మంది మార్కెట్లో మా రిఫరల్ ద్వారా తీసుకుంటే ఉచిత కాల్స్ ఇస్తామని చెప్తుంటారు. అలాంటి […]

మరింత సమాచారం కోసం
Best Books to learn stock market

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు Best Books to learn stock market

Best Books to learn stock market స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు One Up On Wall Street ఈ పుస్తకం రచయిత పీటర్ లించ్ ఒక అమెరికన్ పెట్టుబడిదారు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్. 1977 మరియు 1990 మధ్య ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాగెల్లాన్ ఫండ్ నిర్వాహకుడిగా, లించ్ సగటున 29.2% వార్షిక రాబడిని సాధించాడు, ఇది స్టాక్ మార్కెట్ సూచికను రెట్టింపు చేయడం మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కలిగిన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!