స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7000 ఎం.టి.ఎస్ పోస్టుల నియామకాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (యెస్.యెస్.సి) భారత ప్రభుత్వంలోని , వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో గల వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / కార్యాలయాలలో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పదవికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎం.టి.ఎస్) పోస్టుల నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల్లో సుమారు 700 ఖాళీలు భర్తీ చేయబడతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7000 ఎం.టి.ఎస్ పోస్టుల నియామకాలు కోరకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 21 మార్చ్ 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 06 ఫిబ్రవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చ్ 2021
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ (టైర్ -1): 01.07.2021 నుండి 20.07.2021
టైర్- II పరీక్ష తేదీ (వివరణాత్మక పేపర్): 21.11.2021
గత సంవత్సరం 2019 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (యెస్.యెస్.సి) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎం.టి.ఎస్) రిక్రూట్మెంట్ కింద వివిధ పోస్టులకు 7099 ఖాళీలను కమిషన్ విడుదల చేసింది. అయితే 2020-21 సంవత్సరానికి కూడా దాదాపు ఇంత మొత్తం లో ఉండవచ్చు.
అయితే ఖాళీల వివరాలు త్వరలో వెబ్ సైట్ ద్వారా విడుదల చేస్తారు. కానీ నోటిఫికేషన్ లో మాత్రం వివరాలు వెల్లడించలేదు.
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి 10వ తరగతి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
తేది 01.01.2021 నాటికి అభ్యర్ధులు వయస్సు కనిష్టం గా 18 సంవత్సరాలు మరియు గరిష్టం గా 25 సంవత్సరాలకు మించరాదు (అనగా అభ్యర్థులు తేది 02-01-1996 ముందు మరియు తేది 01-01-2003 తరువాత ఉండరాదు).
అభ్యర్ధులను వ్రాత పరిక్ష ద్వారా ఎంపిక చేయబడును. పరీక్ష రెండు దశలలో జరుగుతుంది. పరీక్షలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (పేపర్- I) మరియు వివరణాత్మక పేపర్ (పేపర్- II).
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ.100/- దరఖాస్తు చేసే సమయం లో చెల్లించవలెను.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎం.టి.ఎస్) పోస్టులకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 05 ఫిబ్రవరి, 2021 నుండి 21 మార్చ్ 2021 లోపు https://ssc.nic.in వెబ్సైట్ను ఉపయోగించి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com