SBI Apprentice Post for Recruitment
ఎస్.బి.ఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2020:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) అప్రెంటిస్ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరడం జరిగింది. ఎస్.బి.ఐ అప్రెంటిస్ 2020 8500 ఖాళీలు పరీక్ష ద్వారా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8500 మంది అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఒక రాష్ట్రంలో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను. SBI Apprentice Post for Recruitment ఈ ప్రాజెక్ట్ కింద అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే పరీక్షకు హాజరుకావలెను.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ నమోదు ప్రారంభ తేదీ : 20 నవంబర్ 2020
ఆన్లైన్ నమోదు చివరి తేదీ: 10 డిసెంబర్ 2020
పరీక్ష తేదీ : జనవరి 2021 నెలలో తాత్కాలికంగా
అప్రెంటిస్ మొత్తం సంఖ్య – 8500
ఖాళీలువిద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, డిగ్రీ పట్టభద్రులు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన అర్హత
వయోపరిమితి:
కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు
ఎస్బిఐ అప్రెంటిస్ 2020 భత్యము:
1 వ సంవత్సరంలో నెలకు రూ .15000/-
2 వ సంవత్సరంలో నెలకు రూ .16500/-
3 వ సంవత్సరంలో నెలకు రూ .19000/-
అప్రెంటీస్ అభ్యర్ధులు ఇతర భత్యాలు / ప్రయోజనాలకు అర్హులు కాదు.
ఎంపిక విధానం:
అభ్యర్ధుల ఎంపిక ప్రధాన పరీక్ష,ఇంటర్వ్యూ దశలలో జరుగుతుంది.
దరఖాస్తు చేయు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు 20 నవంబర్ 2020 నుండి 2020 డిసెంబర్ 10 వరకు sbi.co.in లో ఆన్లైన్ మోడ్ ద్వారా పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబిసి, ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు : రూ. ౩౦౦ / –
ఎస్సీ , ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు నిభందన లేదు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.
నోటిఫికేషన్ మరియు నమోదు వివరాల లింక్
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com