మీరుపెట్టిన పెట్టుబడి రెట్టింపు ఎప్పుడు అవుతుంది ?
ఈ మద్య మీరు చూస్తూనే ఉంటారు, చాలా మంది ముడుపరులను ఆకర్షించడానికి ఎన్నో రకాలా వాగ్దానాలు చేస్తూఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.
వాటిలో ముఖ్యమైనది మీ పెట్టుబడి ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అవుతుందో ఆలోచించారా అని… సాధారణంగా ఇది లెక్కించడానికి ఎటువంటి పెద్ద కాలిక్యులేటర్లు అవసరం లేదు.
ఇప్పడు చెప్పబోయేది అదే. సుమారుగా విలువను అంచనా వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానినే రూల్ అఫ్ 72 Rule of 72 అని పిలుస్తుంటారు.
రూల్ అఫ్ 72 Rule of 72 అంటే పెట్టుబడి రెట్టింపునకు అయ్యే సమయం
= (72 / చక్ర వడ్డీ రేటు )
మీరు ముందు గా తెలుసుకోవలిసింది మీరు పెట్టుబడి పెట్టె సాధనము ఎంత వడ్డీరేటు ను ఇస్తుందో గమనిచండి. దాని ద్వారా ఈ క్రింద ఉదాహరణ ను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఒక వ్యక్తీ తన దగ్గర ఉన్న పెట్టుబడిని 7% వార్షిక చక్ర వడ్డీ రేటు ఉన్న సాధనము లో పెట్టుబడి పెట్టారు అయితే అతని పెట్టుబడి రూల్ అఫ్ 72 ప్రకారం
Rule of 72 = సమయం = 72/ 7 = 10.28 సంవత్సరాలు.
గమనిక:
ఇక్క మీరు చక్ర వడ్డీ రేటు సంవత్సరానికి లేదా ఒక నెల అన్నది జాగ్రత్త గా గమనించి అంచనా వేయండి.
ఇక్క పెట్టుబడి సాధనం అంటే అది బ్యాంకులోని సేవింగ్స్ ఖాతా కాని, మ్యుటుఅల్ ఫండ్ నందు కాని, షేర్ మార్కెట్ లోకాని ఏదైనా పరిగణించవచ్చు.
మరిన్ని ఆదాయం & పొదుపు విషయాల కోసం teluguguruji.com