ఆర్.బి.ఐ లో  జూనియర్ ఇంజనీర్ పోస్టులు

ఆర్.బి.ఐ లో  జూనియర్ ఇంజనీర్ పోస్టులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ  ) లో  జూనియర్ ఇంజనీర్ (సివిల్) మరియు  జూనియర్  ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల నియామకాల కోసం  అర్హతగల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరింది.  ఆసక్తి మరియు  అర్హత గల అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2021 లోపు ఆన్‌లైన్ మోడ్ ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021

ఖాళీల వివరాలు:

జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 24 పోస్టులు

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 24 పోస్టులు

విద్యార్హత:

జూనియర్ ఇంజనీర్ (సివిల్) :

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్శిటీ లేదా బోర్డు నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం మూడేళ్ల డిప్లొమా కనీసం 65% మార్కులు (ఎస్సీ / ఎస్టీ / పి.డబ్ల్యు.డి కేటగరీ అభ్యర్ధులకు  55%) లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ 55% మార్కులతో (ఎస్సీ / ఎస్టీ / పి.డబ్ల్యు.డి కేటగరీ అభ్యర్ధులకు 45%).

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్శిటీ లేదా బోర్డు నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో కనీసం మూడేళ్ల డిప్లొమా కనీసం 65% మార్కులు (ఎస్సీ / ఎస్టీ / పి.డబ్ల్యు.డి కేటగరీ అభ్యర్ధులకు 55%) లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిగ్రీ 55% మార్కులతో (ఎస్సీ / ఎస్టీ / పి.డబ్ల్యు.డి కేటగరీ అభ్యర్ధులకు 45%).

అనుభవం:

జూనియర్ ఇంజనీర్ (సివిల్):

కార్యాలయ భవనాలు / వాణిజ్య భవనాలు / నివాస సముదాయాల యొక్క నిర్మాణ పనుల అమలు మరియు పర్యవేక్షణలో  డిప్లొమా అభ్యర్ధులకు  కనీసం 2 సంవత్సరాల అనుభవం మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్ధులు  కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. అలాగే ఆర్‌.సి.సి డిజైన్ మరియు ఇతర సివిల్ వర్క్స్ మీద పరిజ్ఞానం, కంప్యూటర్ల పరిజ్ఞానం  మరియు సివిల్ వర్క్స్ మొదలైన వాటికి టెండర్ల తయారీ అనుభవం కలిగి ఉండాలి.

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):

భవనాలు / వాణిజ్య భవనాలు HT / LT సబ్‌స్టేషన్లు, సెంట్రల్ ఎసి ప్లాంట్లు, లిఫ్ట్‌లు, యుపిఎస్, డిజి సెట్లు, సిసిటివి, ఫైర్ అలారం సిస్టమ్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ల అమలు మరియు పర్యవేక్షణలో డిప్లొమా అభ్యర్ధులకు  కనీసం 2 సంవత్సరాల అనుభవం మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్ధులు  కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

తేది 01 జనవరి, 2021 నాటికి సాధారణ అభ్యర్ధుల వయోపరిమితి 30  సంవత్సరాలు (భారత ప్రభుత్వం అందించిన సడలింపు  ఓబిసి అభ్యర్ధులకు  28 సంవత్సరాలు మరియు  ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులకు 30 సంవత్సరాలు) కలిగి ఉండవలెను.

దరఖాస్తు రుసుం:

అభ్యర్ధులు సమాచారం ఛార్జీలు క్రింద రూ.50/- ఆన్ లైన్  ద్వారా దరఖాస్తు నమోదు చేసే సమయం లో చెల్లించవలెను. ఎటువంటి దరఖాస్తు రుసుం లేదు.

దరఖాస్తు చేయువిధానం:

అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2021  నుండి 15 ఫిబ్రవరి, 2021 లోపు  www.rbi.org.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల ద్వారా  దరఖాస్తు విధానం అంగీకరించబడవు.

ఆర్.బి.ఐ లో  జూనియర్ ఇంజనీర్ పోస్టుల పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!