NHAI Recruitment Deputy Manager Posts 2021
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 41 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 7 వ సిపిసి యొక్క పే మ్యాట్రిక్స్ యొక్క స్థాయి 10 లో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) జీతాలు ఉండవచ్చని తెలిపింది. సివిల్ విభాగంలో గేట్-2021 స్కోర్ల ద్వారా ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన నియామకాలు చేపట్టబడును. NHAI Recruitment Deputy Manager Posts 2021 ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ నందు https://nhai.gov.in ఆన్ లైన్ ద్వారా 28 మే 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Job Website – Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28 మే 2021
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) – 41 పోస్టులు
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండవలెను.
అభ్యర్థులు వయస్సు ప్రకటన ముగింపు తేదీ నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకొనవలెను.
అభ్యర్థుల ఎంపిక సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోరు 2021 ఆధారంగా ఎంపిక చేపట్టడం జరుగుతుంది.
NHAI Recruitment Deputy Manager Posts 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com