నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్.బి.టి) లో శాశ్వత ప్రాతిపదిక నియామకాలు
నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్.బి.టి) అసిస్టెంట్ డైరెక్టర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది(ప్రకటన నెం. EST./43/2020). ప్రధాన కార్యాలయం డిల్లీ మరియు ప్రాంతీయ కార్యాలయాలు అయిన బెంగళూరు, ముంబై మరియు కోల్కతా నగరాలలో ఎంపిక అయిన అభ్యర్ధులకు పోస్టింగ్ ఇవ్వబడును. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్.బి.టి) అనేది ఒక భారతీయ ప్రచురణ సంస్థ, ఇది 1957 లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ క్రింద స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడింది. (ఎన్.బి.టి) ఇప్పుడు భారతదేశ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ట్రస్ట్ యొక్క కార్యకలాపాలలో ప్రచురణ, పుస్తకాలు మరియు పఠనం, విదేశాలలో భారతీయ పుస్తకాలను ప్రోత్సహించడం, రచయితలు మరియు ప్రచురణకర్తలకు సహాయం మరియు పిల్లల సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఉన్నాయి. పిల్లలు మరియు చదువుకునే వారికీ పుస్తకాలతో సహా అన్ని వయసుల వారికి అనేక భారతీయ భాషలలో పఠన సామగ్రిని (ఎన్.బి.టి) ప్రచురిస్తుంది.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం….
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 16 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021
అసిస్టెంట్ డైరెక్టర్: 02 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ (ప్రొడక్షన్): 01 పోస్టు
అసిస్టెంట్ ఎడిటర్: 02 పోస్టులు
ప్రొడక్షన్ అసిస్టెంట్: 01 పోస్టు
ఎడిటోరియల్ అసిస్టెంట్: 03 పోస్టులు
అకౌంటెంట్: 03 పోస్టులు
స్టెనోగ్రాఫర్: 02 పోస్టులు
అసిస్టెంట్: 04 పోస్టులు
లైబ్రేరియన్: 01 పోస్టు
జూనియర్ అనువాదకుడు (హిందీ): 01 పోస్టు
లైబ్రరీ అసిస్టెంట్: 02 పోస్టులు
కళాకారుడు: 01 పోస్టు
డ్రైవర్: 03 పోస్టు
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ.500/- డిమండ్ డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు తో పాటు సమర్పించవలెను.
దరఖాస్తు నమూనా మరియు విద్యార్హత కొరకు నోటిఫికేషన్ ను పరిశీలించగలరు.
ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు నమూనా రూపం లో నమోదు 15 ఫిబ్రవరి 2021 లోపు దరఖాస్తు చేసుకొన వలెను.
పూర్తీ వివరాలకు https://www.nbtindia.gov.in/ వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కొరకు teluguguruji.com