భీమా అంటే మనకు ధీమా కలగాలి. అది మన కోసం లేదా మన వాళ్ళ కోసం ధీమా కలిగించాలి. కాని భీమా తీసుకోవాలంటే మనకి నిర్వచనాలు, షరతులు, పరిమితులు, మినహాయింపులు మరియు నిజంగా మనకి గందరగోళానికి గురిచేస్తాయి.
మీ ఇల్లు, మీ విలువైన వస్తువులు, మీ విలువైన జీవితం ఇలాంటివి ప్రమాదంలో ఉంటే మీరు చేయాల్సిన చివరి విషయం ఏమిటంటే, మీ భీమా సంస్థ ఎవరు మరియు మీ ఏజెంట్ ఎవరు వారు ఎలా సహాయం చేస్తారో తెలుసుకోవాలి.
భీమ కొనేముందు మీరు చూడవలసిన విషయాలు.
కంపెనీ పేరు మరియు చరిత్ర:
ఇప్పుడున్న ఈ యుగం లో మీకు అనేక మాధ్యమాల ద్వారా అనేక కంపెనీలు ప్రచారం లో ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న భీమా సంస్థలను పరిశోధించండి. వారి వెబ్సైట్లను సందర్శించడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. వారు వ్యాపారంలో ఎంతకాలం ఉన్నారు. వారి లక్ష్యం, దృష్టి మరియు విలువలు. వారి ఆర్థిక పరిస్థితి, యాజమాన్య విలువలు ఇలా ఎన్నో మీరు తెలుసు కోవాలి.
భీమ కంపెనీ అందించే సేవలు:
మీరు తీసుకునే భీమా ఎలాంటి సేవలు ఇస్తుందో తెలుసుకోండి. భీమా సంస్థతో ఎలా సంభాషించవచ్చో అర్థం చేసుకోండి. ఆన్లైన్ ద్వారా బిల్లు చెల్లింపు సేవలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు తీసుకునే సదుపాయం ఉన్నదా లేదా తెలుసుకోండి. 24/7 వినియోగదారుల సేవ ఉన్నదా లేదా. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ద్వారా సేవలు ఉన్నావా లేవా తెలుసుకోండి.
కవరేజ్ లేదా వర్తింపు సమయం:
మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకు తగిన కవరేజీని అందించే బీమా కంపెనీని ఎంచుకోండి. తక్కుడ ప్రీమియం తో ఎక్కువ కాలం వరకు మీకు భీమా సదుపాయం కల్పిస్తుందో తెలుసుకోండి. సాధారణం గా ప్రీమియం విలువ పెరిగితే కవరేజ్ కూడా పెరుగుతుంది.
అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు లేదా రాయితీ:
చాలా భీమా సంస్థలు అనేక డిస్కౌంట్లను లేదా రాయితీలు అందిస్తున్నాయి. మీ పరిస్థితికి, మీరు ఎంచుకునే వస్తువులను ఎంత తగ్గింపు వర్తిస్తుందో తెలుసుకోండి. అలాగే ఎంత కాలం రాయితీ వస్తుందో తెలుసుకోండి.
పాత వినియోగదారుల అభిప్రాయాలు:
మీరు ఎంచుకున్న భీమ కొనుగోలు చేసేముందు వారి యొక్క పాత వినియోగ దారుల అభిప్రాయాలు తెలుసుకునే పరిచయం చేయండి. వారి అనుభవాల గురించి తెలుసుకోవడం ఇది ఎంతో ముఖ్యం.
ఏజెంట్ యొక్క అభిప్రాయం:
మీరు భీమా కొనుగోలు చేసే సమయంలో ఏజెంట్ యొక్క అభిప్రాయం పరిగణలోనికి తీసుకోవద్దు. దీనిలో వారి లాభాపేక్ష ఎక్కువ మరియు వినియోగదారుల శ్రేయస్సు తక్కువ అనే విధంగా ఆలోచించండి. అలాంటి సమయంలో ఎక్కువ భీమా ఏజెంట్లను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి.