హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) మేనేజర్, జనరల్ మేనేజర్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు 20 జనవరి 2021 లోపు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంపెని గురుంచి:
సింధియా షిప్‌యార్డ్‌గా స్థాపించబడిన దీనిని ది సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌లో భాగంగా పారిశ్రామికవేత్త వాల్చంద్ హిరాచంద్ నిర్మించారు. యార్డ్ నిర్మాణానికి తగిన ప్రదేశంగా వాల్చంద్ విశాఖపట్నం ను ఎంచుకున్నాడు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో పూర్తిగా నిర్మించిన మొదటి ఓడను సింధియా షిప్‌యార్డ్‌లో నిర్మించారు.
వాల్చంద్ 1953 లో మరణించాడు, మరియు సింధియా షిప్‌యార్డ్ వ్యవస్థాపకుల బంధువుల క్రింద విజయవంతంగా పనిచేయడం కొనసాగించింది. 1961 లో షిప్‌యార్డ్ జాతీయం చేయబడింది మరియు హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) గా పేరు మార్చబడింది. 2010 లో, హెచ్ఎస్ఎల్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నుండి రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. అణుశక్తితో పనిచేసే అరిహంత్ క్లాస్ జలాంతర్గామి అభివృద్ధిలో యార్డ్ కీలక పాత్ర పోషించింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 09 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 జనవరి 2021
ఖాళీల వివరాలు:
శాశ్వత ప్రతిపాదిక నియామకాల కొరకు:
జనరల్ మేనేజర్ (హెచ్ఆర్): 01 పోస్టు
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్): 01 పోస్టు
అదనపు జనరల్ మేనేజర్ (హెచ్ఆర్): 01 పోస్టు
మేనేజర్ (కమర్షియల్): 02 పోస్టులు
మేనేజర్ (టెక్నికల్): 04 పోస్టులు
కాంట్రాక్టు ప్రతిపాదిక నియామకాల కొరకు:
డిజిఎం (విసి –11184): 01 పోస్టు
మేనేజర్ (SAP IT బేసిస్ / SAP ABAP వెబ్డిన్ప్రో): 02 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 02 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (భద్రత): 01 పోస్టు
అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్): 02 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 02 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (వీసీ –11184): 01 పోస్టు
జూనియర్ మేనేజర్ (ఐపిఎంఎస్ విసి –11184): 01 పోస్టు
మెడికల్ ఆఫీసర్ (కాంట్రాక్ట్): 02 పోస్టులు
సీనియర్ కన్సల్టెంట్ (స్వదేశీకరణ): 01 పోస్టు
సీనియర్ కన్సల్టెంట్ (ఇన్ఫ్రా ఆగ్మెంటేషన్): 01 పోస్టు
సీనియర్ కన్సల్టెంట్ (SAP / ERP): 01 పోస్టు
విద్యార్హత:
విద్యార్హత మరియు అనుభవ వివరాల కొరకు నోటిఫికేషన్ చూడగలరు.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది 8 జనవరి 2021 నాటికి గరిష్టంగా 40 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు రుసుం:
సాధారణ అభ్యర్ధులు రూ. 300 /- దరఖాస్తు రుసుము చెల్లించవలెను. ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు ఫీజు నిభందన వర్తించదు.
దరఖాస్తు చేయువిధానం:
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 08 జనవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.