డబ్బులు ఎలా దాచుకోవాలి మన అవసరాలకి సరిపడేలా How to save money to suit our needs

How to save money to suit our needs

డబ్బులు ఎలా దాచుకోవాలి మన అవసరాలకి సరిపడేలా

సాధారణంగా డబ్బులు సంపాదించే  ప్రతి ఒక్కరికి  ఎలా దాచుకోవాలో తెలియదు. కొంతమంది రియల్ ఎస్టేట్ అని మరి కొందరూ స్టాక్ మార్కెట్ అని అంటూ ఉంటారు అయితే ముందుగా ఎలా పొదుపు చేయాలో తెలుసుకోరు. భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు వారికోసం ఈ క్రింద కొన్ని సూచనలు. మీ నిజమైన అవసరాలకు మీ డబ్బు ఉపయోగపడేలా చూసుకోండి  How to save money to suit our needs.

మీ సంపాదన నిజంగా ఈ క్రింది విధముగా చేసుకోండి దాని వలన ఎంతో కొంత లబ్ది పొందుతారు.

 1. మీరు సంపాదించిన జీతంలో కనీసం 40% పొదుపు చేయడం అలవాటు చేసుకోండి.
 2. ముందుగా మీరు సంపాదించిన డబ్బులు పొదుపు చేసి అప్పుడు ఖర్చుచేయడం నేర్చుకోండి.
 3. మీ మూడు నెలల జీతం అత్యవసర నిధి గా ఎప్పుడూ ఉంచుకోండి. ఇది మీ మొదటి లక్ష్యం. ఒకే సారి 3 నెలల జీతం దాచడం కుదరదు కనుక నెల జీతంలో 25% దాచండి. ఇది కరోన నేర్పిన మొదటి పాఠం.
 4. పొదుపు చేసేందుకు మంచి మార్గాలు ఎంచుకోండి వాటిలో ప్రధానమైనవి మ్యూచువల్ ఫండ్స్ లేదా  బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్లు.
 5. మ్యుచువల్ ఫండ్స్ లో రకరకాలు ఉంటాయి వాటిలో ఈక్విటీ (స్మాల్ కాప్, మిడ్ కాప్, లార్జ్ కాప్), డెట్ (ఋణం), హైబ్రిడ్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మీ లక్ష్యాన్ని బట్టి ఎంచుకోండి.
 6. మీ జీవితానికి ఒక టర్మ్ పాలసీ ఇన్సూరెన్ తీసుకోండి. ఇది మీ ఆదాయాన్ని మరియు మీ వయస్సు ని బట్టి దీని విలువ నిర్ణయించుకోండి. దీని ద్వారా ఎంతో రక్షణ ఉంటుంది.
 7. మెడికల్ ఇన్సూరెన్స పాలసీ ఖచ్చితంగా తీసుకోండి. ప్రతీ మెడికల్ పాలసీ లోనూ 3 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద రోగాలకి కవరేజి ఉంటుంది. అందుకోసం సాధ్యమైనంత తొందరగా తీసుకోండి.
 8. క్రెడిట్ కార్డు వీలయినంత తెలివిగా వాడండి. క్రెడిట్ కార్డు వాడటం వల్ల మీకు ఒక క్రేడిట్ హిస్టరీ నమోదు అవుతూ ఉంటుంది, అందువల్ల తరవాత దినాలలో తీసుకోబోయే పెద్ద ఋణాలకు, గృహ నిర్మాణ/కొనుగోలు ఋణాలకు ఈ క్రెడిట్ హిస్టరీ బాగా ఉపయోగపడుతుంది.
 9. మీ వద్ద 20% మార్జిన్ సొమ్ము ఉన్నప్పుడు మాత్రమే గృహ ఋణము తీసుకోండి. మీ జీతం లో 60% కంటే ఎక్కువ ఈ.ఎమ్.ఐ లు ఉండకూడదు.
 10. వ్యక్తిగత ఆదాయపన్ను మిహయింపు కోసం మాత్రమే గృహ ఋణము తీసుకోని ఇల్లు కొనవద్దు.
 11. మీరు రిటైర్ అయ్యాక ఎంత సొమ్ము మీ చేతిలో ఉండాలో వాటి కోసం మీరు నెలకి ఎంత దాచాలో తెలుసుకోండి.
 12. ఉచితంగా అందు బాటులో ఉన్నాయి కదా అని ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడకండి. అది ఎంతో ప్రమాదం.
 13. ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి, మీరు వ్యాపారం చేయాలనీ అనుకున్నా లేక షేర్ మార్కెట్ లో పెట్టుబడి చేయాలనీ అనుకున్నా అప్పులు చేసి పెట్టుబడి పెట్టకండి. ఏదైనా జరగవచ్చు.
 14. మీరు వ్యాపారం కానీ షేర్ మార్కెట్ లో పెట్టుబడి ఏది చేసిన మీ పెట్టుబడి సురక్షితం గా ఉండేలా చర్యలు తీసుకోండి.

పైన తెలిపిన విషయాలను ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి How to save money to suit our needs. అప్పుడే మీ అవసరాలకి మీ డబ్బు ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యం ఎంతో ప్రమాదం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

 

మరిన్ని పొదుపు విషయాల కోసం teluguguruji.com 

Car Insurance About

కారు భీమా మీకు తెలుసా Car Insurance About

కారు భీమా మీకు తెలుసా – Car Insurance About 1988 నాటి మోటారు వాహన చట్టం ప్రకారం, మీ కారును భారతీయ రోడ్లపై నడపడానికి వాహన బీమా కలిగి ఉండటం కూడా తప్పనిసరి. అందుకే చాలా మంది తప్పనిసరి కదా అని మాత్రమే కొంటూ ఉంటారు. నిజానికి ఈ కారు భీమ మిమ్మల్ని మీ వాహనానికి కానీ మిమ్మల్ని హాని కలిగించే దురదృష్టకర సంఘటనల యొక్క ఆర్థిక నష్టాల నుండి రక్షిస్తుందని ఎప్పటికి మరువకండి. కారు […]

మరింత సమాచారం కోసం
Insurance

భీమా కొనే ముందు తెలుసుకోవలసిన విషయాలు

భీమా అంటే మనకు ధీమా కలగాలి. అది మన కోసం లేదా మన వాళ్ళ కోసం ధీమా కలిగించాలి. కాని భీమా తీసుకోవాలంటే మనకి నిర్వచనాలు, షరతులు, పరిమితులు, మినహాయింపులు మరియు నిజంగా మనకి గందరగోళానికి గురిచేస్తాయి. మీ ఇల్లు, మీ విలువైన వస్తువులు, మీ విలువైన జీవితం ఇలాంటివి ప్రమాదంలో ఉంటే మీరు చేయాల్సిన చివరి విషయం ఏమిటంటే, మీ భీమా సంస్థ ఎవరు మరియు మీ ఏజెంట్ ఎవరు వారు ఎలా సహాయం చేస్తారో […]

మరింత సమాచారం కోసం
సావరిన్ గోల్డ్ బాండ్

సావరిన్ గోల్డ్ బాండ్స్ మరియు బంగారం కొనడం ఒక్కటేనా ?

సావరిన్ గోల్డ్ బాండ్స్ మరియు బంగారం కొనడం ఒక్కటేనా ? ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ లేదా బంగారం పైన పెట్టుబడి ఈ రెండు మార్గాలు చాలా బాగా ప్రాచుర్యం లోనికి వచ్చాయి. భారతీయులకు, బంగారం పట్ల ఆసక్తి, గౌరవం ఇంకా విలువ ను రోజు రోజు కి పెంచుకుంటూ పోతున్నాయి. అయితే మనం బంగారం కొన్నప్పుడు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా కొంటున్నాం (మార్కెట్ రేటు, మజూరి, తరుగు, పన్నులు  కలిపి). మనం బంగారం అమ్మాలనుకుంటే  […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!