FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది.

అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా 4 సెప్టెంబర్ 2020 న ప్రకటించారు దీనితో  ఈ గేమ్ కు మరింత ఆశలను, భారీ అంచనాలను  పెంచింది.

ఇది ఆండ్రాయిడ్ లోనే ప్రస్తుతానికి లభిస్తుంది. భారత ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమానికి మద్దతు లో భాగం గా ఇవ్వడమే ఈ ఆట యొక్క ఉద్దేశ్యం అని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ ఆట యొక్క సమీక్ష.

 1. నిజానికి 460 యం.బి సైజ్ లో దొరికే మంచి గేమ్ అనే చెప్పాలి.
 2. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం గ్రాఫిక్స్ నాణ్యత ను మీ మొబైల్ ఫోనే ప్రకారం సరి చేసుకునే సదుపాయం కూడా కలిపించారు.
 3. దీని లో కనిపించే సైనికుడు మాత్రం మందు గా పిడిగుద్దులతో శత్రువు మీద దాడి చేస్తుంటారు. ఇది అనుకున్నంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. కాని మొదిటి రెండు రౌండ్లలో పెద్ద మార్పు కనిపించదు.
 4. మధ్యలో అక్కడ అక్కడ శత్రువులను ఎదురుకొని వారి ఆయుధాలని కూడా తీసుకొని దాడి చేసే లాగా ఈ ఆట ను తీర్చిదిద్దారు. కాని అది కూడా కొద్ది నిమిషాలకి మాత్రమే పరిమితిమ్చడం కొంచెం నిరాశ కలిగిస్తుంది.
 5. ఆట ప్రారంభంలో ఉండే కొద్దిసేపటి పరిచయ విషయాలు కొంత ఉత్సాహాన్ని కల్గిస్తాయి. దానితో పాటు వచ్చే ఆటగాడి మాటలు హిందీ భాష లో వినడానికి బాగుంటుంది.
 6. Pub-G మొబైల్ గేమ్ లో లాగా ప్రత్యర్ధులు కూడా ఆటగాళ్ళు మాత్రం కాదు. ఇది పూర్తిగా ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించారు.
 7. ఇందులో ఆటగాడు శక్తిని పొందటానికి దగ్గరలోని క్యాంపు ఫైర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. కాని Pub-G మొబైల్ గేమ్ తరహా లో వెంటనే శక్తిని పొందే వీలు లేదు.
 8. అయితే ఇందులో ఆయుధాలు దాదాపు గా తెలుగు సినిమా లో వాడే ఆయుధాలు లాగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు సింహాద్రి సినిమా లో హీరో గారు వాడె కత్తి లాగా ఉండటం కూడా విశేషం.
 9. ఈ ఆట పూర్తిగా 30 నిమిషాలకు పరిమితి చేయడం కూడా ఒక మంచి విషయం. దీనిలో నాలుగు రౌండ్లు ఉన్నాయి. ఇవి 30  నిమిషాల లో పూర్తీ చేయాల్సి ఉంటుంది.
 10.  దేశభక్తి పెంపొందించే మొదటి గేమ్ అనే చెప్పాలి.
 11. నిజానికి ఇందులో కనపడే సన్నివేశాలు మనం వార్తలలో చూసిన సన్నివేశాలను పోలి ఉంటాయి.

చివరిగా ఒక్కమాట లో చెప్పాలంటే ఇది ఒక మంచి గేమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది Made in India.

మరిన్ని టెక్ విషయాల కోసం teluguguruji.com

Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 08 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

ప్రసిద్ధ చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పుడు ఫిట్నెస్ బ్యాండ్ ను విడుదల చేయబోతుంది. ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ధర మాత్రం రూ.2500/- దగ్గరలో ఉండబోతుందని ఇప్పటికే గుసగుసలు వస్తున్నాయి. దీని పై వన్ ప్లస్ మాత్రం 11 జనవరి ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబోతునట్లు ట్విట్టర్ లో ప్రకటించింది.

మరింత సమాచారం కోసం
error: Content is protected !!