ఎలిప్టికల్ మెషిన్ తో వ్యాయమం చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు

మీరు ఏరోబిక్ వ్యాయామం చేసినప్పుడు, మీ కండరాలకు ఎక్కువ రక్తం మరియు ఆక్సిజన్ అందించడానికి మీ గుండె మరియు ఊపిరితిత్తులు మరింత పని చేయాల్సి ఉంటుంది.

ఈ ఎలిప్టికల్ మెషిన్ మంచి ఏరోబిక్ వ్యాయామం చేసే ఒక సాధనం.  దీని ద్వారా  మీ గుండె, ఊపిరితిత్తులు మరియు కండరాలను బలోపేతం అయ్యే అవకాశం ఎక్కువ. దీనిని క్రాస్ ట్రైనర్ అని కూడా పిలుస్తుంటారు.

మీరు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని అంటే కేలరీలను ఖర్చు చేసే మార్గం.  మీ శరీర బరువును బట్టి,  సాధారణంగా   30నిమిషాల వ్యాయామం చేస్తే  270 నుండి 400 కేలరీలను ఖర్చు చేయవచ్చు.

ఎలిప్టికల్ వ్యాయామం తో రన్నింగ్, జాగింగ్ లాంటి వ్యాయామాలతో పోలిస్తే శరీర బరువును గణనీయంగా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలలో తెలిసింది.

శరీర వ్యాయామం ముఖ్యంగా పై భాగం (ఛాతి, వెన్నముక)  మరియు క్రింద భాగం (నడుము) ఎలిప్టికల్ వ్యాయామం తో సాధ్యం అవుతుంది అంటే మీ శరీరం పూర్తిగా వ్యాయామం చేయబడుతుంది.

మీరు సాధారణ శారీరక శ్రమల్లో పాల్గొనలేకపోతే లేదా ఎక్కువ సేపు ఆఫీస్ లోగాడిపే వారైతే  ఎలిప్టికల్‌పై వ్యాయామం చేయడం ద్వారా మీ ఫిట్‌నెస్‌ను పొందడానికి ఇది గొప్ప మార్గం.

 

elliptical trainers 1424300 1279x944 1

ఎలిప్టికల్‌ వ్యాయామం ద్వారా  వచ్చే లాభాలతో కొన్ని నష్టాలు తెలుసుకోవాలి కదా !

రన్నింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్‌తో పోలిస్తే మీరు ఎముక సాంద్రతలో తక్కువ మెరుగుదల పొందుతాయి. ఎలిప్టికల్ వ్యాయామం అనేది నడవడం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది, కాబట్టి కాలి కండరాలు కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకశం ఉంది.

మీరు మీ కాళ్లను బలోపేతం చేయడానికి మరియు ఎముక సాంద్రతను పెంచుకోవాలనుకుంటే మీ దినచర్యలో ఇతర వ్యాయామాలను కూడా చేర్చడం చాలా ముఖ్యం.

చివరిగా ఈ కరోన విపత్తులో ఇంటి నుండి చేసుకునే ఉత్తమమైన సాధనంగా చెప్పుకోవచ్చు. లాభాలాతో పోల్చుకుంటే నష్టాలు అతి తక్కువనే చెప్పాలి.

Walking Benefits

WALKING నడక వలన కలిగే లాభాలు ఏమున్నాయి

WALKING నడక వలన కలిగే లాభాలు ఏమున్నాయి మనకి ఎప్పుడైతే శారీరక శ్రమ తగ్గుతుందో, సాధారణంగా అందరూ వైద్యులు ఇచ్చే సూచన నడక. మనం నడవటం వలన కలిగే లాభాలు ఎంటో తెలిసుకుందాం. ఉదయాన్నే నడవటం వలన మీ రోజు వారి దిన చర్య ఉత్సాహాన్ని మరియు చైతన్యాన్ని కలిగిస్తుంది. నడక మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి గొప్ప మార్గం, దీని వలన మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. సగటున […]

మరింత సమాచారం కోసం
Fever Reasons

జ్వరం అంటే ఏమిటి ? ఎందుకు వస్తుంది ? తెలుసుకోండి

జ్వరం అంటే ఏమిటి ? ఎందుకు వస్తుంది ? తెలుసుకోండి జ్వరం అంటే ఏమిటి జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ ఉష్ణోగ్రత ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మారుతూ ఉంటుంది, అయితే ఇది సాధారణంగా 98.6°F (37°C) ఉంటుంది. జ్వరం ఒక వ్యాధి కాదు. ఇది సాధారణంగా మీ శరీరం అనారోగ్యం లేదా శరీరం లో ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం […]

మరింత సమాచారం కోసం
red 3580560 1280

“రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది” నిజామా లేక అబద్దమా.

“రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది” అనే సామెత మొదటిసారిగా 1913 లో వాడారు, ఇది 1866 లో వచ్చిన పెంబ్రోకెషైర్ సామెతపై ఆధారపడింది. నిజానికి, నోట్స్ అండ్ క్వరీస్ మ్యాగజైన్ ఆ మాటను  ప్రచురించిన మొదటిది. అది ఎలా ఉండేది మొదటగా అంటే  “పడుకునేటప్పుడు ఒక ఆపిల్ తినండి, మరియు మీరు డాక్టర్ తన రొట్టె సంపాదించకుండా ఉంచుతారు.” ఎక్కువ ఆపిల్ పండ్లను  తినడం  వలన ఆసుపత్రి లో వైద్యుడికి తక్కువ సందర్శనలతో సంబంధం […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!