ECIL గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ నియామకాల నోటిఫికేషన్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ కంపెనీ 160 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల అప్రెంటిస్ మరియు 20 డిప్లొమా అప్రెంటిస్ల నియామకాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 15 జనవరి 2021 లోపు ఆన్ లైన్ ద్వారా పోస్టులకు http://www.mhrdnats.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ ను ECIL హైదరాబాద్ నందు జరుపవలెను.
ఎలక్ట్రానిక్స్లో బలమైన స్వదేశీ స్థావరాన్ని సృష్టించడానికి హైదరాబాద్లో ఎ. ఎస్. రావు 11 ఏప్రిల్ 1967 న స్థాపించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ కంపెనీ అటామిక్ ఎనర్జీ విభాగంలో భారత ప్రభుత్వ సంస్థ. ECIL అనేది బహుళ-ఉత్పత్తి, బహుళ క్రమశిక్షణా సంస్థ, ఇది దేశీయ అణు శక్తి, అంతరిక్ష మరియు రక్షణ రంగాలపై దృష్టి పెట్టింది. దేశీయ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్ మరియు ఇ-గవర్నెన్స్ డొమైన్లలో కూడా ECIL బలమైన ఉనికిని కలిగి ఉంది. భారతదేశం యొక్క అణు ఇంధన సంస్థలతో, ముఖ్యంగా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్.పి.సి.ఐ.ఎల్) మరియు ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐ.జి..సిఎ..ఆర్) లతో ఇసిఐఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశీయ డిఫెన్స్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్డి.ఓ)), స్పేస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (ఇండియా)) సివిల్ ఏవియేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోలీస్ మరియు ఇతర పారా మిలటరీ ఫోర్సెస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, స్పేస్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, స్టీల్ అండ్ బొగ్గు వ్యూహాత్మక రంగాలకు కూడా ఇసిఐఎల్ చురుకుగా మద్దతు ఇస్తుంది.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 06 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 జనవరి 2021
అభ్యర్ధుల ఎంపిక మొదటి జాబితా ప్రదర్శన తేది: 18.01.2021
మొదటి జాబితా అభ్యర్థులు రిపోర్ట్ చేయవలిసిన తేది: 20 మరియు 21.01.2021
అభ్యర్ధుల ఎంపిక రెండవ జాబితా ప్రదర్శన 28.01.2021
రెండవ జాబితా అభ్యర్థులు రిపోర్ట్ చేయవలిసిన తేది: 29 మరియు 30.01.2021
అప్రెంటిస్షిప్ శిక్షణ ప్రారంభ తేది: 04.02.2021
ఖాళీల వివరాలు:
డిగ్రీ అప్రెంటిస్
ECE – ఇ.సి.ఇ ఇంజనీరింగ్ – 100 పోస్టులు
CSE – సి.యెస్.ఇ ఇంజనీరింగ్- 25 పోస్టులు
Mechanical – మెకానికల్ ఇంజనీరింగ్ -20 పోస్టులు
EEE – ఇ.ఇ.ఇ. ఇంజనీరింగ్ -10 పోస్టులు
Civil – సివిల్ ఇంజనీరింగ్ -05 పోస్టులు
డిప్లొమా అప్రెంటిస్
ECE ఇ.సి.ఇ ఇంజనీరింగ్ డిప్లొమా – 10 పోస్టులు
CSE ఇ.సి.ఇ ఇంజనీరింగ్ డిప్లొమా – 10 పోస్టులు
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం లో తేది 1 ఏప్రిల్ 2018 న లేదా తరువాత ఉత్తీర్ణులై ఉండవలెను.
డిప్లొమా అప్రెంటిస్ విషయంలో, అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇసిఇ సిఎస్ఇ శాఖలలో మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత 1 ఏప్రిల్, 2018 న లేదా తరువాత ఉత్తీర్ణులై ఉండవలెను.
అభ్యర్ధుల ఎంపిక మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. (అనగా బి.ఇ / బి. టెక్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెరిట్ మరియు డిప్లొమాకు డిప్లొమా కన్సాలిడేటెడ్ మార్క్స్ అప్రెంటిస్లు)
తేది:31.01.2021 నాటికి అభ్యర్ధుల వయస్సు గరిష్టం గా 25 సంవత్సరాలు మించరాదు. మరియు ఎస్సీ / ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ECIL గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ నియామకాల ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 15 జనవరి 2021 లోపు పోస్టులకు ఆన్ లైన్ ద్వారా http://www.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ గమనించగలరు.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com