టిక్‌టాక్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసుకోబడిన ఆప్ అని ఒక నివేదిక లో తేలింది. మొబైల్ ఆప్ విశ్లేషణ సంస్థ యాప్ అన్నీ ప్రకారం, టిక్‌టాక్ ఈ సంవత్సరం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటిలోనూ అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఆప్. టిక్‌టాక్ ఫేస్‌బుక్‌ను వెనక్కు తీసి ఈ సంవత్సరం అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఆప్ గా మారింది. ఫేస్బుక్ ఇప్పుడు అత్యధికంగా డౌన్లోడ్ చేసిన రెండవ ఆప్, తరువాత వాట్సాప్.
కొత్త శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫ్లాగ్షిప్ ఇప్పుడు ప్రీ-ఆర్డర్ కోసం భారతదేశంలోని బెంగళూరులోని శామ్సంగ్ ఒపెరా హౌస్ ఫ్లాగ్షిప్ స్టోర్‌లో ఆర్డర్లు ప్రారంభం అయ్యాయని సమాచారం. కొనుగోలుదారులు తమ గెలాక్సీ ఎస్ 21 ను ముందుగానే రూ .2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కాని ఫోన్ వివరాలు కాని, పూర్తీ ధర సమాచారం కాని వెల్లడించలేదు. శామ్సంగ్ ఎస్-21 సిరీస్ జనవరి 14 న అధికారికంగా లాంచ్ అవుతుందని, జనవరి చివరి నాటికి భారతదేశంలో లభిస్తుందని సామజిక మాధ్యమాల్లో వార్త చక్కెర్లు కొడుతుంది.
కోవిడ్ – టీకా తప్పుడు సమాచారాన్ని తీసివేయడానికి మరియు సమాచారం శోధించే వారికీ నిజమైన సమాచారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయబోతునట్టు తెలిసింది. దానిలో భాగంగా ముందుగా అమెరికా వంటి దేశాలలో టీకా యొక్క సమాచారాన్ని పెడుతునట్లు సమాచారం. ఎందుచేతనంటే ముందుగా టీకా అమెరికాలోనే విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇన్స్టాగ్రామ్ ఆప్, షాపింగ్ చేసుకునేలా ఆప్ లో మార్పులు చేయబోతుంది. వ్యాపారులు వారి ఉత్పత్తులను రీల్స్ ద్వారా ప్రచారం చేసుకునేలా మరియు వీక్షకులు వాటిని కొనుగోలు చేయడానికి వీలుగా మార్చబోతునట్లు వివరాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటె ఇప్పటికే కొంతమంది ఔత్సాహికులు దీనిని మరో టిక్ టాక్ లా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫేస్ బుక్ లో షాపింగ్ చేసుకునేలా ఉన్నా, అంత ఆదరణ మన దేశం లో లభించలేదు. చూడాలి వినియోగదారులు దేనిని ఆదరిస్తారో.