12.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

షియోమి రెడ్ మీ – 9 పవర్ ఫోన్ అమెజాన్‌ లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

షియోమి రెడ్‌మి-9 పవర్ ఫోన్ ను డిసెంబర్ 17 న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ ద్వారా విడుదల చేయబోతుంది. ఇప్పటికే అమెజాన్‌ లో నోటి ఫైమీ అనే సంకేతం తో కనపడుతుంది. ఇప్పటికే షియోమి రెడ్‌మి 9 ఎ, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ – 9, రెడ్‌మి నోట్ – 9 ప్రో  కలిగి పేర్లతో మొబైల్ ఫోనే విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఇవి 15,000 లోపు దొరకడం విశేషం.

రెడ్‌మి-9 పవర్ పై షియోమి  కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా లో వినియోగదారులను ఆకర్షించే పని మొదలు పెట్టింది. ఇటీవల ట్విట్టర్‌లో టీజర్‌ను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్న పవర్ ప్యాక్డ్ డివైస్‌గా ఉండబోతుందని వినియోగదారులకు అంచనాలు వేసుకుంటున్నారు.

 

టెనెట్ యొక్క మొదటి ఆరు నిమిషాలు యూట్యూబ్‌లో చూడండి.

జాన్ డేవిడ్ వాషింగ్టన్ నటించిన టెనెట్ సినిమా యొక్క ప్రత్యేకమైన మొదటి 6 నిమిషాలు చూడండి! కాని టెనెట్ యొక్క ప్రారంభ నాంది చూడటానికి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే, వారు ఇప్పుడు యూట్యూబ్‌లోచూడవచ్చు. వచ్చే వారం సినిమా డిజిటల్ విడుదలకు ముందే వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రం యొక్క మొదటి ఆరు నిమిషాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసారు.

 

గూగుల్ మరియు ఆపిల్ వినియోగదారుల లొకేషన్ డేటాను నియంత్రణ ను నిషేధించబోతున్నాయి

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, టెక్ కంపెనీలు తమ అనువర్తనాల నుండి ఎక్స్-మోడ్ యొక్క కోడ్‌ను తీసివేయమని డెవలపర్‌లకు చెప్పాయి, లేదా వాటిని సంబంధిత అనువర్తన దుకాణాల నుండి తీసివేసే ప్రమాదం ఉంది.  X- మోడ్ అనే  కోడ్ మీ ఫోన్‌లోని కొన్ని అనువర్తనాల్లో ఉండవచ్చు దీని ద్వారా  మీ లొకేషన్  డేటాను ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు, గూగుల్ మరియు ఆపిల్ దీనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఆపిల్ యొక్క ఐఫోన్ లో  వాట్స్ ఆప్ మరియు టెక్స్ట్ మేసేజ్ నోటిఫికేషన్ ఇబ్బందులు  కలిగి ఉంది

ఆపిల్ యొక్క ఐఫోన్  లో  వాట్స్ ఆప్ మరియు టెక్స్ట్ మేసేజ్ నోటిఫికేషన్  రావడం లేదు. ఇప్పటికే ఈ సమస్య ను చాల మంది తమ ఫోన్ లలో వస్తుంది సోషల్ మీడియా లో చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. దీని పైన ఆపిల్ నుండి వివిరణ రావాల్సి ఉంది.

 

ఇంటెల్ కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 అనే పేరు తో ల్యాప్‌టాప్ రాబోతుంది

భారతదేశంలోని ప్యూర్‌బుక్ సిరీస్‌లో మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా విడుదల చేయబోతుంది. త్వరలో నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 అనే పేరు తో ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు జరుపబోతునట్లు సమాచారం.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్‌సైట్‌లోని జాబితా దేశంలో నోకియా ల్యాప్‌టాప్‌లను ప్రారంభించినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సోషల్ మీడియా లో పలు చిత్రాలు కనపడుతున్నాయి  వాటిలో  నోకియా ప్యూర్‌బుక్ X14 బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. నోట్బుక్ పూర్తి-పరిమాణ, చిక్లెట్-శైలి కీబోర్డ్ మరియు మల్టీ-టచ్తో పెద్ద టచ్ప్యాడ్ను కలిగి ఉంది.

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!