ఈ రోజు జరిగిన కొన్ని సాంకేతిక విషయాలను టెక్ వార్తల లో తెలుసుకునే Daily Telugu Techప్రయత్నం చేద్దాం
సైబర్‌పంక్ 2077 గేమ్ కొన్న వారి యొక్క డబ్బులు వెనక్కు తెరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుందని మైక్రోసాఫ్ట్ కు చెందినా యక్స్ బాక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. మైక్రోసాఫ్ట్ తన మైక్రోసాఫ్ట్ స్టోర్ వెబ్ సైట్ ద్వారా గేమ్ ను కొనుగోలు చేసిన ఎవరికైనా ఇప్పుడు సైబర్‌పంక్ 2077 నగదు ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ఇప్పటికే కొంతమంది కస్టమర్లకు వాపసు ఇస్తుండగా, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికీ కూడా సదుపాయాన్ని కల్పించింది.
కొత్త మోటరోలా స్మార్ట్ఫోన్లను కొనడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నడూ లేదు! ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌సేవింగ్ డేస్ అమ్మకాల సందర్భంగా అసాధారణమైన శ్రేణిని 40% తగ్గింపు లో ఇస్తున్నట్లు మోటరోలా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
ఆపిల్ ఎయిర్ పాడ్స్ మాక్స్ తక్కువ పవర్ మరియు అల్ట్రాలో పవర్ మోడ్లు గురించి తన అధికారిక ఆపిల్ సపోర్ట్ పేజీలో వివరాలు వెల్లడించింది. ఎయిర్‌పాడ్స్ మాక్స్ యొక్క సపోర్ట్ పేజీలో వివరించినట్లుగా, హెడ్ఫోన్లను ఐదు నిమిషాలు వాడకుండా ఉంచడం వలన బ్యాటరీని ఆదా చేయడానికి అవి వెంటనే “తక్కువ పవర్ మోడ్” లో మారుతుంది. అలాగే వాటిని 72 గంటలు వాడకుండా వదిలేస్తే, ఎయిర్‌పాడ్స్ మాక్స్ బ్లూటూత్‌ను ఆపివేసి బ్యాటరీని మరింత ఆదా చేయడానికి “తక్కువ పవర్ మోడ్” లోకి మారుతుంది. ఎయిర్‌పాడ్స్ మాక్స్‌ను స్మార్ట్ కేసులో ఉంచితే, అవి వెంటనే “తక్కువ పవర్ మోడ్” లోకి వెళ్తాయి. స్మార్ట్ కేసులో హెడ్ఫోన్లను 18 గంటలకు మించి ఉంచినట్లయితే, “అల్ట్రాలో పవర్ మోడ్” మారుతుంది.
https://support.apple.com/en-us/HT211886