గ్రూప్.బి మరియు గ్రూప్.సి పోస్టులకు అటామిక్ ఎనర్జీ విభాగం (డి.ఎ.ఇ), 74 గ్రూప్.బి మరియు గ్రూప్.సి ఖాళీల నియామకానికి ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరింది. అభ్యర్ధులు 28 నవంబర్ 2020 నుండి 27 డిసెంబర్ 2020 వరకు ఆన్లైన్ దరఖాస్తును చేసుకొనవలెను.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 28 నవంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు ముగింపు తేదీ: 27 డిసెంబర్ 2020
గ్రూప్ బి: 02 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ Gr II: 02 పోస్టులు
గ్రూప్ సి: 72 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III: 04 పోస్టులు
- అప్పర్ డివిజన్ క్లర్క్ (యు.డి.సి): 05 పోస్టులు
- జూనియర్ స్టోర్ కీపర్: 63 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ –2:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి 10 వ తరగతి లేదా తత్సమాన మైన మెట్రిక్యులేషన్ కలిగిఉండవలెను. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100 పదాలు (డబ్ల్యు.పి.ఎం) మరియు టైపింగ్ ఇంగ్లీష్ టైప్‌లో నిమిషానికి 45 పదాలు (డబ్ల్యు.పి.ఎం) వేగం కలిగిఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు కనిష్ట 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు తేది 27 డిసెంబర్ 2020 నాటికి ఉండవలెను.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ –3:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ లేదా తత్సమాన మైన మెట్రిక్యులేషన్ కలిగిఉండవలెను. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు (డబ్ల్యు.పి.ఎం) మరియు టైపింగ్ ఇంగ్లీష్ టైప్‌లో నిమిషానికి 30 పదాలు (డబ్ల్యు.పి.ఎం) వేగం కలిగిఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు కనిష్ట 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు తేది 27 డిసెంబర్ 2020 నాటికి ఉండవలెను.
అప్పర్ డివిజన్ క్లర్క్ (యు.డి.సి):
అభ్యర్ధులు అభ్యర్ధులు కనీసం 50% మార్కులతోగుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ లేదా తత్సమాన మైన మెట్రిక్యులేషన్ కలిగిఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు కనిష్ట 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు తేది 27 డిసెంబర్ 2020 నాటికి ఉండవలెను.
జూనియర్ స్టోర్ కీపర్:
అభ్యర్ధులు కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ లేదా తత్సమాన మైన మెట్రిక్యులేషన్ కలిగిఉండవలెను.( సైన్స్ లో గ్రాడ్యుయేట్ లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్)
అభ్యర్ధుల వయస్సు కనిష్ట 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు తేది 27 డిసెంబర్ 2020 నాటికి ఉండవలెను.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 27 డిసెంబర్ 2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.