కారు భీమా మీకు తెలుసా Car Insurance About

కారు భీమా మీకు తెలుసా – Car Insurance About

1988 నాటి మోటారు వాహన చట్టం ప్రకారం, మీ కారును భారతీయ రోడ్లపై నడపడానికి వాహన బీమా కలిగి ఉండటం కూడా తప్పనిసరి. అందుకే చాలా మంది తప్పనిసరి కదా అని మాత్రమే కొంటూ ఉంటారు. నిజానికి ఈ కారు భీమ మిమ్మల్ని మీ వాహనానికి కానీ మిమ్మల్ని హాని కలిగించే దురదృష్టకర సంఘటనల యొక్క ఆర్థిక నష్టాల నుండి రక్షిస్తుందని ఎప్పటికి మరువకండి.

కారు భీమా కోనేముందు లేదా దానిని పొడిగించే లేదా పునరుద్ధరణల ముందు ఈ క్రింద తెలిపిన విషయాల గురుంచి కారు భీమా  Car Insurance About తెలుసుకోండి:

జీవితభీమా వర్తింపు:

మీరు ప్రయాణం చేసే సమయం లో ప్రమాదంలో మరణానికి గురైనప్పుడు ప్రాణాలతో ఉన్నవారికి ప్రయోజనాలను అందిస్తుందా లేదా అని తెలుసుకోండి.

చట్టపరమైన వ్యాజ్యాల రుసుం:

ఇది ప్రమాదం ఫలితంగా మీపై తీసుకువచ్చిన చట్టపరమైన రుసుములతో సహా వ్యాజ్యాలను వర్తింపజేయడం జరుగుతుందా లేదా అని గమనించండి.

అదనపు రాయితీ:

మీరు కొనే భీమా కంపెనీలో మీకు మునుపటిలో సభ్యత్వం ఉంటే వాళ్ళు మీకు ఎలాంటి అదనపు రాయితీ ఇస్తున్నారో గమనించండి.

సౌలభ్యం:

మీరు ప్రీమియం చెల్లంచడానికి వీలుగా వారు కలిపించే సౌకర్యాలను పరిగణలోకి తీసుకోండి. ఇప్పటి ఇంటర్నెట్ యుగంలో ప్రీమియం చెల్లింపు ఎన్ని రకాల చెల్లింపు విధానాలు ఇస్తున్నారో తెలుసుకోండి. కొన్ని కంపెనీలు మీ ఇంటి వద్దకే వచ్చి చెల్లింపు సౌకర్యాలు కూడా ఇస్తున్నారు.

క్లెయిమ్ బోనస్:

మీరు పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేయకపోతే, మీరు కొన్ని నిబంధనలు మరియు షరతులను అనుసరించి పునరుద్ధరణలపై నో క్లెయిమ్ బోనస్ ఇవ్వబడుతుందో లేదో తెలుసుకోండి.

వినియోగదారునికి మద్దతు:

మీకు వచ్చే చిన్న పాటి సందేహలని మీరు ఎంచుకునే భీమా కంపెనీ ఏ విధముగా తీరుస్తుందో గమనించండి.  మీ సమస్యలు ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కరించబడతున్నాయో లేదో చూడండి.

crash test 1620591 1280

సాధారణంగా భీమా ఈ క్రింద వాటికి మాత్రమే వర్తిస్తుంది:

  1. గుద్దుకోవటం వల్ల తలెత్తే నష్టాలు మరియు నష్టాలు

  2. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం వల్ల కలిగే నష్టాలు మరియు నష్టాలు.
  3. వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి చర్యల వల్ల కలిగే నష్టాలు
  4. వ్యక్తిగత ప్రమాదం రూ. ప్రమాదం జరిగితే యజమాని మరణం లేదా వైకల్యానికి ఇచ్చే సహాయం.

  5. మీ కారు వల్ల కలిగే ఆస్తి నష్టాలు మరియు ఎదుటివారికి జరిగే గాయాలకు చెల్లిస్తుంది.

సాధారణంగా భీమా ఈ క్రింద వాటికి వర్తించదు:

  1. మీరు మద్యపానం సేవించి వాహనం నడుపుతు ప్రమాదానికి గురి అయ్యినప్పుడు.
  2. మీరు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతు ప్రమాదానికి గురి అయ్యినప్పుడు. (ఉదా. వరదనీటి లో కారు నడపడం)
  3. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతు ప్రమాదానికి గురి అయ్యినప్పుడు.

Car Insurance About

మీరు మరిన్ని పొదుపు విషయాల గురించి   teluguguruji.com 

How to save money to suit our needs

డబ్బులు ఎలా దాచుకోవాలి మన అవసరాలకి సరిపడేలా How to save money to suit our needs

How to save money to suit our needs డబ్బులు ఎలా దాచుకోవాలి మన అవసరాలకి సరిపడేలా సాధారణంగా డబ్బులు సంపాదించే  ప్రతి ఒక్కరికి  ఎలా దాచుకోవాలో తెలియదు. కొంతమంది రియల్ ఎస్టేట్ అని మరి కొందరూ స్టాక్ మార్కెట్ అని అంటూ ఉంటారు అయితే ముందుగా ఎలా పొదుపు చేయాలో తెలుసుకోరు. భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు వారికోసం ఈ క్రింద కొన్ని సూచనలు. మీ నిజమైన అవసరాలకు మీ […]

మరింత సమాచారం కోసం
Insurance

భీమా కొనే ముందు తెలుసుకోవలసిన విషయాలు

భీమా అంటే మనకు ధీమా కలగాలి. అది మన కోసం లేదా మన వాళ్ళ కోసం ధీమా కలిగించాలి. కాని భీమా తీసుకోవాలంటే మనకి నిర్వచనాలు, షరతులు, పరిమితులు, మినహాయింపులు మరియు నిజంగా మనకి గందరగోళానికి గురిచేస్తాయి. మీ ఇల్లు, మీ విలువైన వస్తువులు, మీ విలువైన జీవితం ఇలాంటివి ప్రమాదంలో ఉంటే మీరు చేయాల్సిన చివరి విషయం ఏమిటంటే, మీ భీమా సంస్థ ఎవరు మరియు మీ ఏజెంట్ ఎవరు వారు ఎలా సహాయం చేస్తారో […]

మరింత సమాచారం కోసం
సావరిన్ గోల్డ్ బాండ్

సావరిన్ గోల్డ్ బాండ్స్ మరియు బంగారం కొనడం ఒక్కటేనా ?

సావరిన్ గోల్డ్ బాండ్స్ మరియు బంగారం కొనడం ఒక్కటేనా ? ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ లేదా బంగారం పైన పెట్టుబడి ఈ రెండు మార్గాలు చాలా బాగా ప్రాచుర్యం లోనికి వచ్చాయి. భారతీయులకు, బంగారం పట్ల ఆసక్తి, గౌరవం ఇంకా విలువ ను రోజు రోజు కి పెంచుకుంటూ పోతున్నాయి. అయితే మనం బంగారం కొన్నప్పుడు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా కొంటున్నాం (మార్కెట్ రేటు, మజూరి, తరుగు, పన్నులు  కలిపి). మనం బంగారం అమ్మాలనుకుంటే  […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!