బెల్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) మరియు టెక్నీషియన్-C పోస్టులకు నియామకాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తన బెంగళూరు నందు శాశ్వత ప్రాతిపదికన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఇ.ఎ.టి) మరియు టెక్నీషియన్-C పోస్టులనియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 పోస్టులు డిప్లొమా అర్హత గా మరియు టెక్నీషియన్-C పోస్టులు ఐ.టి.ఐ. అర్హతగా నియామకాలు చేపడుతున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు 23 ఫిబ్రవరి, 2021 లోపు bel-india.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకొనవలెను.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 20 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03 ఫిబ్రవరి 2021
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 14 పోస్టులు
మెకానికల్ – 10 పోస్టులు
ఎలక్ట్రికల్ – 1 పోస్టు
టెక్నీషియన్-C
ఎలక్ట్రో మెకానిక్ – 14 పోస్టులు
ఫిట్టర్ – 3 పోస్టులు
మెషినిస్ట్ – 6 పోస్టులు
వెల్డర్ – 1 పోస్టు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం నందు మూడు సంవత్సరముల డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
టెక్నీషియన్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంటర్మీడియట్ తో పాటు సంభందిత విభాగం నందు ఐ.టి.ఐ మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్ కూడా పూర్తిచేసి ఉండవలెను.
తేది01.01.2021 నాటికీ అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలకు మించరాదు.
అభ్యర్ధులను వ్రాత పరిక్ష ద్వారా ఎంపిక చేయబడును.
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ.300/- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసే సమయం లో చెల్లించవలెను. రిజర్వు అభ్యర్ధులకు మినహాయింపు కలదు.
బెల్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) మరియు టెక్నీషియన్-C పోస్టులకు ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా ఆన్ లైన్ లో నమోదు చేసుకొన వలెను.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com
నిరంతర వార్త ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts