రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది” నిజామా లేక అబద్దమా?

“రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది” అనే సామెత మొదటిసారిగా 1913 లో వాడారు, ఇది 1866 లో వచ్చిన పెంబ్రోకెషైర్ సామెతపై ఆధారపడింది. నిజానికి, నోట్స్ అండ్ క్వరీస్ మ్యాగజైన్ ఆ మాటను  ప్రచురించిన మొదటిది. అది ఎలా ఉండేది మొదటగా అంటే  “పడుకునేటప్పుడు ఒక ఆపిల్ తినండి, మరియు మీరు డాక్టర్ తన రొట్టె సంపాదించకుండా ఉంచుతారు.”

ఎక్కువ ఆపిల్ పండ్లను  తినడం  వలన ఆసుపత్రి లో వైద్యుడికి తక్కువ సందర్శనలతో సంబంధం కలిగి ఉండదని పరిశోధనలు చూపించినప్పటికీ, మీ ఆహారంలో ఆపిల్ పండ్లను తీసుకోవడం వలన మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.నిజానికి ఒక ఆపిల్ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.  కేలరీలు: 95 గ్రాములుపిండి పదార్థాలు: 25 గ్రాములుఫైబర్: 4.5 గ్రాములువిటమిన్ సి, రాగి, పొటాషియం, విటమిన్ కె.  ముఖ్యంగా, విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన సమ్మేళనాలను తటస్తం చేయడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది మరియు అనేక రకాల వ్యాధుల  నుండి రక్షిస్తుంది. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, వీటిలో ప్రధానం గా  క్వెర్సెటిన్, కాటెచిన్, ఫ్లోరిడ్జిన్, క్లోరోజెనిక్ ఆమ్లం ఉన్నాయి.

ఆపిల్ పండ్లను తినడం వలన కలిగే ప్రయోజనాలలో ఈ క్రింద తెలిపినవి ప్రధానమైనవి :

1. ఫైబర్ ఉండటం కారణంగా ఊబకాయానికి మరియు బరువు తగ్గడాన్ని ఎంతో సహాయపడుతుంది.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

2. రోజుకు ఒక ఆపిల్ తినడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ.

3. ఉబ్బసం లేదా ఊపిరి తీసుకునే సమస్యలను ఆపిల్ పండ్లను తినడం ద్వారా తగ్గించవచ్చు.

4. ఆపిల్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరం లోని చెడు కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివలన హృద్రోగ సమస్యలు తగ్గే అవకాశం ఉన్నాయి.

5. కొన్ని అధ్యయనాలు మరియు పరిశోధనలలో ఆపిల్ పండ్లను తినడం వలన ఎముకల సాంద్రత బలపడినట్లు గమనించారు.

అలాగే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు ఎంతో ప్రమాదం. వీటిని మాత్రం తినకూడదని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఆపిల్ విత్తనాలలో అమిగ్డాలిన్ అనే మొక్కల సమ్మేళనం ఉంటుంది, ఇది విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుచేత విత్తనాలను సాధ్యమైనంత వరకు తినకూడదు.

సాధ్యమైనంత వరకూ తాజాగా ఉండే ఆపిల్ పండ్లను తినడం మంచిది. అయితే మార్కెట్ లో తాజాగా ఆపిల్ ఉండేందుకు మరియు  ఆపిల్ మెరిసేలా ఉండేందుకు వాటిపై అనేక రసాయనాలను వాడుతుంటారు. అలాంటివాటిని తీసుకుని అనారోగ్యం బారిన పడవద్దు.  నిజానికి ఆపిల్ పండ్లను కొనే ముందు అనేక జాగ్రత్తలు అవసరం.  నిజానికి ఆపిల్ పండు తినడం వలన లాభాలతో పాటు రసాయనాలను వాడిన ఆపిల్ తినడం వలన ఎన్నో నష్టాలు ఉంటాయని మరువకండి !

గమనిక: ఇది పాఠకులకు అవగాహన కోరకు మాత్రమే ఇవ్వబడినదని గమనించగలరు.
మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి