#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 సెకన్ల నిడివి కల ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. అయతే ఇందులో ఎటువంటి సంభాషణలు లేకపోవటంతో ప్రేక్షకుల కు నిరుత్సాహాన్ని కలిగించింది. దీనికి సంభందించిన ఇదే ట్రైలర్ ను యు ట్యూబ్ లో కూడా విడుదల చేయడం విశేషం.
షియోమి తన ట్విట్టర్ ఖాతాలో రెడ్ మీ నోట్ 9 మరియు యం. ఐ. – 10 కు సంబంధించిన ఆకర్షనీయమైన వివరాలను వెల్లడించే ప్రయత్నం చేసింది దీనితో 5-జి మొబైల్ ఎలా ఉండబోతుందో తెలిపింది.
మోటో రోలా ఇప్పుడు తాజాగా విడుదల చేసిన మొబైల్ ఫోన్ ను రూ.2000 /- తగ్గింపు చేసినట్లు ప్రకటించింది. ఈ మొబైల్ ఫోన్ 5జి ఉండటం కూడా విశేషం.